సాధించిన ప్రగతి @ కోరాడ నరసింహా రావు !
 భగ - భగ మండే భానుని తీక్ష్ణ 
వీక్షణమ్ములతో... విల - విల 
     లాడెను భూమి !
పెనుగాలులు - తుఫానులతో... 
ఆల్ల కల్లోలం  ప్రాణి కోటి  !
సూక్ష్మ క్రిముల దాడితో... అష్ట దిగ్బంధనమాయె బ్రతుకు  !
అభద్రతా భావము - యుద్ధము లకు దారితీసె... !
ఆయుధ, ధన బలములతో... 
అధికార దాహంతో... ఎత్తులు-
పైఎత్తులతో...ఎన్నెన్నో కు యు క్తులతో ఆరని రావణ కాష్ఠంగా మారిపోయె నీ అవని !
 
అక్రమం-అన్యాయం,హింస - దౌర్జన్యంచేస్తున్నవిస్వైరవిహారం 
మనుగడకే ముప్పుదెచ్చు కాల మపుడె దాపురించె.... !
సుఖము - శాంతి కరువై పోయి 
దిన - దినగండం...నూరేళ్లా యుస్సై వీడని బెదురూ భయ ములతో.... బిక్కు - బిక్కు మని బ్రతికె....  ప్రపంచం !
ఇదీ.. యుగాలు  శ్రమపడి... 
మనిషి సాధించిన ప్రగతి !!
..   *******

కామెంట్‌లు