సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 శ్రీకారం...సాకారం
*******
ప్రతి మదిలో ఎన్నో, ఎన్నెన్నో ఆలోచనల అంకురాలు మొలుస్తూ చలిస్తూ, జ్వలిస్తూ...
అందమైన భవిష్యత్తు కోసం పునాదులు వేసుకొమ్మనీ,మంచి పనులకు వెంటనే శ్రీకారం చుట్టమనీ,రేయంతా కన్న కలల్ని సాకారం చేసుకొమ్మని..
అంతరంగం ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది...
"ఆలస్యం అమృతం విషం"..ఆనందం, ఆరోగ్యంతో పాటు అస్థిత్వ పతాక నెగరేసే వాటి పట్ల తాత్సారం తగదనీ, వెంటనే ఆచరణకు శ్రీకారం చుట్టమనీ...
అప్పుడే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు..ఆశయాలతో పెనవేసుకున్న ఆలోచనలు,అందుకోవాలనుకున్న లక్ష్యాలు,ఆదర్శ జీవితం పట్ల కన్న  కలలు సాకారమై,అంతులేని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి..
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు