ఐక్య గీతిక పాడర తమ్ముడా
ఆవేశ వాహినికి కట్టలేసి
అందరమొకటని చాటింపు వేసి
౹౹ఐక్య౹౹
అలజడుల సంస్కృతిని అణచివేసి
కారు చిచ్చులకు కాలయముడివై
ద్వేషాల్నొదలి ఎల్లరమొకటనీ
౹౹ ఐక్య౹౹
అన్న తమ్ముడని ఆరివారముగ
మెలిగి తల్లి భారతి సంతసిల్ల
సౌభ్రాతృత్వమే మా నైజమని
౹౹ఐక్య౹౹
:-దుగ్గి గాయత్రి,
టి.జి.టి.తెలుగు,
పరిశోధక విద్యార్థిని,
(గ్రా)కల్వకుర్తి,
(జి) నాగర్ కర్నూల్,
(రా)తెలంగాణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి