దేవుడు రాసిన రాతలు
కాదు జీవితం...
అరచేత మెరిసిన
గీతలు కాదు జీవితం...
మనసును నొప్పించి మెప్పించే
మాటలు కాదు జీవితం...
కట్టుకున్న అందమైన కోటలు
కాదు జీవితం...
మనుషులను వేరు చేసే
మతం కాదు జీవితం
వేధించే జ్ఞాపకాల
ఫలితం కాదు జీవితం...
ఆర్భాటాల
ఆరాటం కాదు జీవితం...
పరులపైన పరుగుల
పోరాటం కాదు జీవితం...
నటనలు దాచే నవ్వు
కాదు జీవితం...
నీతో లేని
నువ్వు కాదు జీవితం...
దోచుకొని దాచుకున్న
పరువు కాదు జీవితం...
బాధ్యతల బంధాల బరువు
కాదు జీవితం...
కాగితాల సంతకం
కాదు జీవితం...
కాలానికి అంకితం
కాదు జీవితం...
కలలు కనే కనుల నేర్పు
కాదు జీవితం...
కలతలకు కరిగే కన్నీటి
ఓర్పు కాదు జీవితం...
నిన్నటి గతం
కాదు జీవితం...
రేపటి హితం
కాదు జీవితం...
చేజారని ఈ క్షణమే
జీవితం...
తడబడని తక్షణమే జీవితం...
మనదైన జీవితం
మనదే జీవితం..!
కాదు జీవితం...
అరచేత మెరిసిన
గీతలు కాదు జీవితం...
మనసును నొప్పించి మెప్పించే
మాటలు కాదు జీవితం...
కట్టుకున్న అందమైన కోటలు
కాదు జీవితం...
మనుషులను వేరు చేసే
మతం కాదు జీవితం
వేధించే జ్ఞాపకాల
ఫలితం కాదు జీవితం...
ఆర్భాటాల
ఆరాటం కాదు జీవితం...
పరులపైన పరుగుల
పోరాటం కాదు జీవితం...
నటనలు దాచే నవ్వు
కాదు జీవితం...
నీతో లేని
నువ్వు కాదు జీవితం...
దోచుకొని దాచుకున్న
పరువు కాదు జీవితం...
బాధ్యతల బంధాల బరువు
కాదు జీవితం...
కాగితాల సంతకం
కాదు జీవితం...
కాలానికి అంకితం
కాదు జీవితం...
కలలు కనే కనుల నేర్పు
కాదు జీవితం...
కలతలకు కరిగే కన్నీటి
ఓర్పు కాదు జీవితం...
నిన్నటి గతం
కాదు జీవితం...
రేపటి హితం
కాదు జీవితం...
చేజారని ఈ క్షణమే
జీవితం...
తడబడని తక్షణమే జీవితం...
మనదైన జీవితం
మనదే జీవితం..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి