:గురుకుల పాఠశాల ప్రవేశ మాదిరి పరీక్ష కు భారీగా హాజరైన విద్యార్థులు; వెంకట్ మొలక ప్రతినిధి  శ్రీ రామకృష్ణ సేవా సమితి తాండూరు ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం గురుకుల పాఠశాల ప్రవేశ మాదిరి పరీక్ష ను నిర్వహించారు. ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ఆదివారం పట్టణంలోని
 సిద్దార్థ జూనియర్ కాలేజ్
లో నాలుగో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు
తెలంగాణ ప్రభుత్వం5 తరగతి ప్రవేశ పరీక్ష కోసం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష విద్యార్థులు ఏ విధంగా రాయాలి మాదిరి పేపర్ ఏ విధంగా ఉంటుందని తెలియజేసేందుకు రామకృష్ణ సేవా సమితి మాదిరి ప్రవేశ పరీక్షను ఏర్పాటు చేసింది ఈ పరీక్ష రాసేందుకు విద్యార్థులు
బషీరాబాద్. పెద్దముల్ యాలాల్, కోడంగల్ మండలాల  హాజరయ్యారు
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ పరీక్షలో 80 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు  మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో
ఐదో తరగతి ప్రవేశం కోసం
గురుకుల సెట్ విడుదల చేశారు
ఈ నెల 8
సెట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్న సందర్భంగా విద్యార్థులకు భయం పోగొట్టాలని ఓఎంఆర్ షీట్ అవగాహన కోసం
నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి పేపర్ తయారు చేశారని
ఈ రిజల్ట్ ఆధారంగా తీసుకొని ప్రవేశ పరీక్షకు లో రాసి మంచి రిజల్ట్ సాధించి సీటు సంపాదించాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సూర్యప్రకాశ్, ఉపాధ్యాయులు 
మానస రెడ్డి, అన్యన, అజయ్ కుమార్ ,రాజు, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, కృష్ణయ్య సోషల్ వర్కర్ వెంకట్,
 సంతోష్,ఆంజనేయులు
అంజయ్య, వెంకటస్వామి
విద్యార్థి తల్లిదండ్రులు
విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు