కరోనా కల్లోలం;-: నెల్లుట్ల. సునీత
  ఆ.వె:-
కంట కాన రాని కర్కశము కరోన
మారణాయుధముగ మారెనిపుడు
మారి తీరు కుక్కె మనిషిని రేపర్ ల
నిజము సున్నితము సునీత పలుకు

 ఆ. వె:_
కళ్ళ తోడ మనము   కానలేమట దీన్ని
భయము కలగ జేయు ప్రజల కెప్పుడు
మందులేని రుజుయే మానవాళిని చంపు
నిజము సున్నితము సునీత పలుకు!!

 ఆ.వె:-
బ్రతకవచ్చు మనము పలుమార్గముల చేత
గడప దాటకుండ గడిపినపుడు
నేను యుండుమింట పదిహేను రోజులు
నిజము సున్నితము సునీత పల్కు.

 ఆ.వె:-
క్రూరమౌ "కరోన" గుంపులో వ్యాపించు
కూడవలదు జనులు గుంపుగాను
ఎక్కు పెట్టు శరమదేకాంతమే యౌను
నిజము సున్నితము సునీత పల్కు.*

ఆ.వె:-
 పద్యమొక్కటైన ప్రతిరోజు వ్రాసిన
వందలాది యగును సుందరముగ
వ్రాయుచున్న వ్యక్తి ప్రతిభ పెరుగునట
నిజము సున్నితము సునీత పల్కు.*

ఆటవెలది
చెరువు నిండ పూసె చెంగల్వ పూవులు 
చేరితెస్తినమ్మ చరణములకు 
కలువ పూల మాల కట్టి తెచ్చితినేను 
కరుణచూపు తల్లి  కమలనయని


కామెంట్‌లు