కవితా శ్రీలు ;-ఎం. వి. ఉమాదేవి
ఆట వెలదులు 

వచన కవితలోని వాడినీ వేడినీ 
రంగమందు దించె రమ్యముగను 
శ్రీనివాసరావు శ్రీలుచె లిoగించె
ఖడ్గ సృష్టి తోడ ఖండితముగ !

కర్షకులకు నీడ కార్మికవిజయమ్ము 
కోరి వ్రాసినాడు కూర్మితోడ
వారి శ్రమలవిలువ వర్ణించ లేమంటు 
వారి వృత్తులకును వందనమిడె !!


కామెంట్‌లు