వేసవికాలం
వచ్చిందంటే ,
ఒకపక్కనుండీ
మామిడిపళ్లు
నోరూరిస్తుంటే
మరోపక్కనుండి
మల్లెపూల -
సుగంధం ....
మనసును తాకి
స్త్రీమూర్తులను
జడతడుముకునేలా
చేస్తుంది ......!
మల్లెపూలు
ఇష్టపడనివారూ
మామిడిపళ్లు
ముట్టుకోనివారూ
బహుఅరుదు !
సాయంత్రం -
మల్లెపూలకోసం ,
ఎదురుచూసే -
గృహిణులు ...
నవవధువులు
మల్లెలనుమించిన
గుభాళింపు...
ముఖాలతో --
మెరిసిపోతుంటారు!
ఆహారం తీసుకునే
ప్రతి సమయంలోనూ
నేనూ ఉన్నానంటూ
మామిడి పండు
ప్రత్యక్షం అవుతుంది ,
సర్వజనావళిని ..
ఆకర్షిస్తుంది.....!
అటుమల్లెపువ్వు
ఇటుమామిడిపండు
ఒకరుతువుకే ---
పరిమితం .....!
అయినా --
సంవత్సరానికి -
సరిపడినంత ,
తృప్తిని --అనందాన్ని
మిగిల్చి పొవడం
ఆ ..రెంటి అభిమతం !
అందుకే...
అందరిని అలరించే-
వేసవికాలంఅంటే,
నాకెంతో ఇష్టం !!
***
వచ్చిందంటే ,
ఒకపక్కనుండీ
మామిడిపళ్లు
నోరూరిస్తుంటే
మరోపక్కనుండి
మల్లెపూల -
సుగంధం ....
మనసును తాకి
స్త్రీమూర్తులను
జడతడుముకునేలా
చేస్తుంది ......!
మల్లెపూలు
ఇష్టపడనివారూ
మామిడిపళ్లు
ముట్టుకోనివారూ
బహుఅరుదు !
సాయంత్రం -
మల్లెపూలకోసం ,
ఎదురుచూసే -
గృహిణులు ...
నవవధువులు
మల్లెలనుమించిన
గుభాళింపు...
ముఖాలతో --
మెరిసిపోతుంటారు!
ఆహారం తీసుకునే
ప్రతి సమయంలోనూ
నేనూ ఉన్నానంటూ
మామిడి పండు
ప్రత్యక్షం అవుతుంది ,
సర్వజనావళిని ..
ఆకర్షిస్తుంది.....!
అటుమల్లెపువ్వు
ఇటుమామిడిపండు
ఒకరుతువుకే ---
పరిమితం .....!
అయినా --
సంవత్సరానికి -
సరిపడినంత ,
తృప్తిని --అనందాన్ని
మిగిల్చి పొవడం
ఆ ..రెంటి అభిమతం !
అందుకే...
అందరిని అలరించే-
వేసవికాలంఅంటే,
నాకెంతో ఇష్టం !!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి