బ్రతుకులు మావి...;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 బ్రతుకులు మావి....బ్రతుకులు మావి....
నీరసించిన నిరుద్యోగ బ్రతుకులు మావి....
ఖరీదయిన కాన్వెంట్లలో కష్టపడి చదివినా
కలతలు తీరని బ్రతుకులు మావి....
డిగ్రీలు సాధించిన పట్టాలు, చేతిలో 
వున్న దిక్కు తోచని బ్రతుకులు మావి....
అద్భుతమైన మేధస్సు వున్నా
ఆశయాలకు దూరంమైన,
విపక్ష బ్రతుకులు మావి....
తూ తూ అంటూ ఉమ్ము ఊసినా 
తుడుచు పోయే బ్రతుకులు మావి....
ఛీ పో అంటూ చీదరించుకున్నా
ఎదురు చెప్పలేక ఆగిన 
చేవ లేని బ్రతుకులు మావి....
మెడ పట్టుకొని బయటకు గెంటినా 
మౌనంగా సాగే బ్రతుకులు మావి....
రేయి పగలు తేడా లేక నడి రోడ్డుపై 
నడిచినా, రాతలు మారని
బ్రతుకులు మావి....
ఆకాశాన్ని అందుకోవాలని 
పరుగులు తీసి, చివరకు ఆకలికి 
అలసిన బ్రతుకులు మావి....
బ్రతుకులు మావి....
బ్రతుకులు మావి....
నీరసించిన నిరుద్యోగ బ్రతుకులు మావి....


కామెంట్‌లు