కూలిబతుకులు(మణిపూసలు);-మిట్టపల్లి పరశురాములు
పొద్దుపొద్దునలేచారు
సద్దిభుజానవేశారు
కలసిగట్టుగకార్మికులు
కూలిజేయవెళ్ళినారు

ఇంటి పట్టు వదిలినారు
తట్టచేతపట్టినారు
పలుగుపారతీసుకొనియు
మట్టినిబాగనుతవ్వారు

గుడిసెకూడులేనివారు
కూడు సరిగ లేనివారు
మేడమీదమేడకట్టి
చలిలొవారువణికినారు

కూలినాలిజేసెటోడ
కూడులేకకుమిలినోడ
కూలిదొరకనప్పుడేమొ
కుమిలికుమిలి ఏడ్చినోడ

కొండకోనతిరిగినోడ
బండలెన్నొకొట్టినోడ
బతుకుపథముసాగలేక
సతికిలపడిపోయినోడ

కంటికికునుకెరగనోడ
పంటికిమెతుకెరుగనోడ
ఆలిపిల్లలందరినిల
పస్తులపాల్జేసినోడ

పిల్లజెల్లకదిలినారు
వలసబాటపట్టినారు
పల్లెలోనపనులులేక
పట్నవాసమెల్లినారు

మండుటెండలోనవారు
బండలెన్నొకొట్టినారు
బతుకుదెరువుకోసమేమొ
చెమటచుక్కలైనారు
            **

(1మేడే కార్మికుల దినోత్సవ సందర్భముగ రాసిన కవనహారము)


కామెంట్‌లు