బాలగీతం;-     సత్యవాణి కె
పదుగురి మెప్పును పొందాలంటే
పరహితమును నువుకోరాలి

సుఖమయజీవివి కావాలంటే
అపరిమిత కాంక్షలు వీడాలి

ఆరోగ్యంగా గడపాలంటే
శ్రమైకజీవివి కావాలి

సభలో మెప్పును పొందాలంటే
చక్కని వక్తవుకావాలి

విదేశాలలో రాణించాలంటే
విజ్ఞానం సముపార్జించాలి

మనమత ఘనతను తెలియాలంటే
పరమత ధర్మం తెలియాలి

మంచిపౌరుడౌ కావాలంటే
స్వఛ్ఛభారతిని కొలవాలి


   

కామెంట్‌లు