కృత్రిమ చల్లదనం
బిల్లు ...
బరువుగా ఉంటుందని
అర్ధరాత్రి ...
ఏ.సి.మూతి బిగించి ,
అలా పవళించానా ..
నా కు నిద్రాభంగం
కలిగిస్తూ-----బయట
ఆకాశంలో---
ఉరుముల ఫెళఫెళలు ,
మెరుపులధగధగలు
భయం సృష్టించాయ్!
వర్షఋతువు -
తొందరపడి ఒకకోయిల
ముందే కూసినట్టు ...
మేనెల....
మొదటివారంలోనే
చిటపటచినుకులు
మొదరయ్యాయి....!
నిద్రలోవున్న
వృక్షజాతి....
కళ్లుతెరిచి ---ప్రకృతి
పచ్చదనంతో
పరవశింప జేసింది !
సహజమైన చల్లదనం
ఉషోదయమై --
నిద్రలేపింది .....!!
****
తొందరపడి ..!!-- డా.కె.ఎల్వీ--హన్మకొండ .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి