మామిడి పండు(బాలగేయం);----గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
పసుపు రంగు మామిడి పండు
పసందైన మామిడి పండు
పిల్లాపాపలందరూ
ప్రాణమిచ్చు మామిడి పండు

వేశవిలో దొరుకుతుంది
ఔషధ గుణం దానికుంది
రక్తపోటును తరుముతుంది
అజీర్తిని తగ్గిస్తుంది

సి-విటమిన్ అందిస్తుంది
కొలస్ట్రాల్‌ని  కరిగిస్తుంది
రక్తహీనత నివారిస్తుంది
ఆరోగ్యమందిస్తుంది

పండ్లలో ఇది రారాజు
ఆరగించూ ! ప్రతిరోజు
దీని రసం బహు మేలు
తృప్తిగా తగిన చాలుకామెంట్‌లు