ముందుగా రచయిత్రికి హృదయ పూర్వక అభినందనలు
*రెప్పవాల్చని స్వప్నం* కవిత్వం ఇప్పుడే చదవడం పూర్తి అయింది..
అనివార్య కారణాల వల్ల చాలా చాలా
ఆలస్యంగా స్పందిస్తున్నాను
మరోలా భావించవద్దు ప్లీజ్ .
అసలు ఎలా స్పందన తెలియచేయాలో
అర్ధం కావడం లేదు
ఎందుకంటే కవితలు అన్నీ
ఒకటికీ మించి ఒకటి ఏంతో బాగున్నాయి
కొన్ని కవితలు చదువుతూ ఉంటే
కన్నీళ్లు అస్సలు ఆగలేదు
అలాగే మరి కొన్ని చదువుతుంటే
ఎక్కడో *గుండెలోతుల్లోని తడిని* తాకిన
భావన కలిగింది.
ఎంతో హృద్యం గా సాగింది
మీ కవితా వాహిని..
కొన్ని కవితలు నిశ్చలమైన నిర్మలమైన సెలయేరు లా
మరికొన్ని . నేలనుండి నింగికి ఎగిసిపడుతున్న కెరటాల్లా ...
మరికొన్ని నిండు గర్భ సముద్రుడిలా...
వుంది ఇందులోని కవితా వాహిని..
బాల్యం....
యవ్వనం....
కౌమార్యం.....
వృధాప్యం.....
ఇలా ప్రతీ మలుపులోని
అంశాలను స్పృసిస్తూ
నిజ జీవితానికి అతి దగ్గరి
అంశాలే కవితా వస్తువులుగా
తీసుకోవడం ఎంతో ప్రశంసనీయం
ప్రతీ కవితలోనూ వాడిన
*పద ప్రయోగం* చూస్తుంటే
రచయిత్రికి తెలుగు భాష మీద ఎంత
పట్టు వుంది అనేది స్పష్టంగా అర్ధం అవుతోంది.
ప్రతీకలన్నీ విన్నుత్న రీతిలో ఉపయోగించారురచయిత్రి.
ప్రకృతిని, మానవుడిని జతచేసి
కవితలల్లడం ఎంతో అభినందనీయం..
*కవితా శీర్షికలు* విభిన్నంగా
కవితను వెంటనే చదవాలని
కుతూహలం కలిగించేలా వున్నాయి.
రచయిత్రికి, తెలుగు భాష మీద
అమోఘమైన పట్టు వుంది
ఆమె మేధలో అద్వితీయమైన
*పద సంపద* వుంది..
భాష మీద ఇంత పట్టు
సాధించడానికి వెనుక గల
రచయిత్రి కృషి సదా ప్రశంసనీయం...
రచయిత్రి తన కవితా వాహిని
ఇలాగే నిరంతరం
నిర్వీరామంగా
విజయవంతంగా
సాగుతూ ఉండాలని
మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
రచయిత్రి నాగజ్యోతిశేఖర్ కు, వేవేల శుభాకాంక్షలు
***
*లక్ష్మీ పద్మజ దుగ్గరాజు*
హైదరాబాద్.
------------------
గుండె లోతుల్లోని తడి! రెప్ప వాల్చని స్వప్నం!!------శ్రీమతి లక్ష్మీ పద్మజ.--దుగ్గరాజు.*
బాగుంది. శుభాకాంక్షలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి