సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఆరాటం... పోరాటం..
*****
ఆరాట , పోరాటాలతో అలసి పోయే వ్యక్తి ప్రతి ఇంట్లో తప్పకుండా ఒకరుంటారు.ఆ ఒక్కరు ఎవరో అందరికీ తెలుసు.ఆ వ్యక్తే అమ్మ.
కడుపులో పడినప్పటి నుండే కనిపించని శిశువు గురించి కలలెన్నో కంటుంది.
అమ్మకు ఎప్పుడూ ఆరాటమే బిడ్డల భవిష్యత్తు బాగుండాలనీ.అందరిలో తన బిడ్డ ప్రత్యేకంగా గుర్తింపు పొందాలనీ, సమాజం మెచ్చేలా సభ్యతా సంస్కారంతో వెలగాలనీ...
పొత్తిళ్ళలో నుండే బిడ్డకు తొలి గురువు అవుతుంది.మాటలతో పాటు మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలిసేలా నైతిక విలువల పాదులు వేస్తుంది.
ఏ కాస్త నలతగా ఉన్నా తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు.
తనను గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, బిడ్డల అవసరాలు తీర్చేందుకు,కాలంతో పాటు పరుగులు తీస్తూ , ఎదురయ్యే అవరోధాలు,సమస్యలతో అలసట మరిచి పోరాడేది ఒక్క అమ్మ మాత్రమే.
అందుకే 'మాతృదేవోభవ' అన్నారు పెద్దలు.
అలాంటి అమ్మకు ఏమిచ్చినా, ఎంత సేవ చేసినా ఋణం తీరదు.మళ్ళీ మనం అమ్మలమై చివరి మజిలీ లో పసిపాపగా చూసుకుంటే తప్ప.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు