ప్రక్రియ.. ఆట వెలదులు
1)
మంచి చెడులదెల్పు మాతృదేవతయమ్మ
కన్నులందు మమత కలికికెపుడు
మరువరానిమేలు మనతల్లి జేయురా
వందనాలు జేతు వాసిగాను !
2)
ఉపవసమును జేయు నుర్విమనకొరకె
యహము మరిచి సాగునాత్మయందు
నాకలినిట దీర్చు నమ్మలెల్లమనకు
దేవతవలె మెచ్చి దీవెనొసగు !
3)
తండ్రి దండనదియు తప్పించు దయతోడ
పిచ్చిపనులు జేయ హెచ్చరించు
కర్రదెబ్బలిచ్చి కఠినమ్ము నొకపరి
గురువుగాను మెలుగు గొప్పవిధము !
4)
వయసుపెరిగినపుడు వడలిన దేహమ్ము
నమ్మకపుడు వలయు నధికకరుణ
నాదరించవలెను నాత్మీయ భావమున్
తల్లికన్న గొప్ప ధరణిలేదు !
5)
అమ్మయున్న చాలు ననురాగ దేవత
రాజ్యలక్ష్మి వలెను రాణువముగ
ధైర్యలక్ష్మి తాను ధన్యతలనె యిచ్చు
రేయి పగలు గాచు రెక్క కింద!
.అమ్మ అనురాగదేవత ; -ఎం. వి. ఉమాదేవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి