గంగిరెద్దు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 గంగిరెద్దన్నా గంగిరెద్దూ 
గంగిరెద్దన్నా గంగిరెద్దూ
వచ్చాడు ఠీవిగా గంగిరెద్దూ
నిలుచున్నాడు హాయిగా గంగిరెద్దూ 

డోలువాయిస్తేను గంగిరెద్దూ 
వెంటనే వచ్చెనూ గంగిరెద్దూ
మెడలో గజ్జెలూ గంగిరెద్దూ 
గణగణా మోగెనూ గంగిరెద్దూ
ఇంపుగా వచ్చెనూ గంగిరెద్దూ
దాని అందం చూడగా గంగిరెద్దూ
వాడి గల కొమ్ములతొ గంగిరెద్దూ
తల వూపుతుందిరా గంగిరెద్దూ
వీపునా వస్త్రాలు గంగిరెద్దూ
సింగిడిని తలపించు గంగిరెద్దూ
ముందుకూ నడుచునూ గంగిరెద్దూ
వెనుకకూ నడుచునూ గంగిరెద్దూ
నాట్యమూ చేయునూ గంగిరెద్దూ
నవ్వించునురా గంగిరెద్దూ
గంగిరెద్దన్నా గంగిరెద్దూ
గంగిరెద్దన్నా గంగిరెద్దూ !!
కామెంట్‌లు