సంతకి వెళ్తున్నానే కాంతం:-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 ఓసే కాంతం, 
సంతకి వెళ్తున్నానే నువ్వు కూడా వస్తావా అని పిలువగానే,
ఓ… నువ్వు పిలవాలే కానీ నేనెందుకు రాను మామా అంది...
సరే పోదాం పదా అనగానే....
చిటికలో చీర మార్చుకొని వస్తానంది....
చూసి చూసి చిరాకు వచ్చినా
కానీ నా చేమంతి మాత్రం బయటకు రాలేదు...
ఏమే వస్తున్నావా లేదా అనగానే… 
వచ్చేసాగా అలా అరుస్తావ్ ఎందుకు అంది...
సరే పోదాం పదా అనగానే....
ముక్కెర మరిచాను మామా పెట్టుకొస్తానంది....
పావుగంట దాటినా పంజరం దాటి చిలుక 
బయటకు రాలేదు...
ఏమే వస్తున్నావా లేదా అనగానే…
వచ్చేసాగా అలా గోల చేస్తావెందుకు అంది...
సరే పోదాం పదా అనగానే....
పూలు పెట్టుకోవడం మరిచాను మామా అంటూ 
ఇంటిలోనికి పరుగు తీసింది....
పూట గడిచినా కానీ నా పసిడి బొమ్మ జాడే లేదు....
ఏమే వస్తున్నావా లేదా అనగానే 
వచ్చేసాగా అంత కోపమెందుకు అంది...
సరే ఇకనైనా పోదాం పా అనగానే....
కళ్ళకు కాటుక మరిచాను మామా అంటూ 
గదిలోకి దూరింది.....
నాకు కళ్ళు తిరిగి నీరసం
అయితే వచ్చింది కానీ కలువ భామ 
కానరానే లేదు....


కామెంట్‌లు