ఎడారి పూలు; -డా.నీలం స్వాతి,చిన్నచెరుకూరు గ్రామం,నెల్లూరు.Ph.no-6302811961.
 ఆ వాకిళ్లలో దీపాల వెలుగులు కనిపించవ్.... చీకటి రేఖలు తప్ప...
ఆ ప్రాంగణాలలో నవ్వుల రాగాలు వినిపించవు...మౌన గీతాలు తప్ప...
ఆ దారిలో అవకాశాల రద్దీ లేదు అందుకే
నిరాశా నీడలు మెల్లగా కమ్ముకుంటున్నాయి...
అక్కడంతా బేరాల వ్యాపారాలు అందుకే
కన్నీటి జడి వానలో కలల మొగ్గలు రాలిపోతున్నాయి...
పసితనాన బాధ్యతల భారాన్ని మీదేసుకున్న నవతరాలు ఒంటరై
వేదనను అనుభవిస్తుంటే....
సమయంతో పోటీపడి 
సమస్యలు దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి...
ఆ మైదానంలో గెలుపోటముల మధ్య భీకర వైరం జరుగుతుంది...
సత్తా పై గెలుపు సవాలు చేస్తుంటే
ఓటమి వెక్కిరిస్తోంది...
అసమర్థత ముందు ఆత్మవిశ్వాసం మొగ్గడం లేదు...
తెలియని భయాల తొందరపాటు తప్పులను చేయిస్తున్న....
ఎండిన ఆశయాల ఏరు వెంట
ప్రయాణం విఫలం అని తెలిసినా
అప్పుడప్పుడు 
ఏడారిలో ఎండమావుల
ఊరట,
ముళ్ళ పూల వాసన 
భారమైన జీవితంలో కూడా బ్రతుకుందన్న ఆశను చూపుతూ ...
. ప్రయత్నాలను మరలా ప్రేరేపిస్తున్నాయి...కామెంట్‌లు