*పరోపకార పద్ధతి*
ఉత్పలమాల:
*మానవతీకటాక్షశిత మార్గణముల్ విదలింపఁజాల వె*
*వ్వానిమనంబు, కోపమయవహ్నిదహింపదు, లోభపాశసం*
*తానము మాల్యచందనవి తానములున్ వెత సేయ నోపకె*
*వ్వానివశంబునన్ మెలఁగు, వాఁడు జయించు జగంబు లన్నియున్.*
*తా:*
ఎవని మనసు అడవారి చూపులు అనే బాణములతో బాధకు గురి అవదో, కోపము అనే నిప్పుతో కాలిపోదో, అత్యాశ అనే పాముల వల్ల బంధింప బడదో, గంధము, దండలు మొదలగు సత్కారములకు లొంగదో అటువంటి ధైర్యవంతుడు ప్రపంచములన్నిటినీ గెలవగలుగుతాడు........... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*అర్జునుడు పాశుపతం సాధించాలి అనుకున్నప్పుడు, మంచివారు లోకహితం కోరుకుంటూ చేసే తపస్సుకు ఎప్పుడూ అడ్డుపడే ఇంద్రుడు హోరు గాలి, జోరు వాన, కండలును కొరికేచలి, మానవ శరీరాన్ని కాల్చివేసె అతివేడిమి ద్వారా అర్జునుని నిలువరించాలి అనుకుంటాడు. కానీ, అదరక, బెదరక, కదలక ఆ అంబాపతి తనని పరీక్షించే పరిస్థితి తీసుకువస్తాడు, పాండవ మధ్యముడు. శివయ్య ఎరుకడుగా వచ్చి, విలువిద్యలో అర్జునుని నిపుణత పరీక్షించి, పాశుపతం ప్రసాదిస్తాడు, ఫల్గుణునికి. అందుకే మనకు భారతం, భాగవతం, రామాయణం మానవాళి వున్నంత వరకూ, మార్గదర్శకాలు గానే వుంటాయి. ఇంతటి ధైర్యం, స్థైర్యం వున్నవాడు కనుకనే ధర్మరాజుకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టాడు. ఇటువంటి ధైర్యము, స్థైర్యమూ గల జీవితాన్ని మనం గడిపే అవకాశాన్ని మనకందరకు ఆ కాలాతీతుడు అయిన సదాశివుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి