"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 45,వ,బాగం)--,"నాగమణి రావులపాటి"
  చెదిరిన ప్రేమ కుదిరిన వేళ జ్జాపకాలన్నీ వ్యాపకాలై మనసు మధురిమలు కురిపించగా ఏవో ఊహలు
హృదయాన్ని పరవశింప జేస్తూ వుంటే ఆప్రేమ
కుసుమాలు విరబూసిన మల్లెలే అందంగా విరిసిన
గులాబీలే మైమరపించే సుగంధబరితాలే........!!
రాహుల్ కుసుమల హృదయాలు మబ్బులు
వీడిని ఆకాశంలా స్వేచ్చా వాయువులను 
ఆస్వాదిస్తూ అపోహలు అనుమానాలు బిడియాలు
పట్టింపులు అన్నీ మరిచి అంతా తామై హద్దులు
లేని ఆనందం సాగరంలో మనసు విహారం........!!
బ్రతుకుకు సాకారం ఇదే ఇదే ఒకదూరం వేయ
చేరువులకు నిలయం విలయ వలయంలో
చిక్కిన పరువం పైట చెంగు పైరగాలి రెపరెపలా
పరుగులు తీస్తుంటే ఇద్దరి మనసులు వేకువ
వెలుగు జిలుగులకై వేచి చూస్తూ నిదురమ్మ
ఒడిలో సేదదీరారు..................‌..!!
రాహుల్ గడ్డం తీసేసి స్మార్ట్ గా తయారై కురిసే
వెన్నెల జాబిలిలా వుంటే విరిసిన అందాల సుమంలా
కుసుమ చూపు మరల్చని అందంతో ముస్తాబైంది.....
చూపులు కలిసిన శుభవేళ కలవర పెట్టే మనసు
చేసే అలజడుల జడిలో తడిసి పోగా రాహుల్
కుసుమ కాఫీ షాపు ముందు ఇషారాల తుషారాలు
చిలకరించి గా ఆ చినుకుల జల్లుల పులకింతలతో
చిన్న సైగ చేసింది వస్తా వెళ్ళమని.........!!
ఇద్దరూ కాస్త దూరంగా వున్నా ఒక పార్క్ కు చేరుకున్నారు ముందుగా రాహుల్ పలకరించగానే
కుసుమ క్షమాపణల వాన కురిపించింది కారణాలు
వివరించే  ప్రయత్నం చేయగా కుసుమా వద్దు
నీవే మీ చెప్పొద్దు...నీస్తానం ఎవరయినా అలాగే
ఆలోచిస్తారు నీవు కాస్త ఎక్కువగా ఆలోచించాను.....‌
నిన్ను తక్కువ అంచనా వేసానేమో ఎన్ని బాధలు
పడుతున్నావో ఎలాంటి స్థితిలో వున్నావో అని 
అనుక్షణం నామనసు రంపపు కోతగా మారింది....
కానీ నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నా
అని అన్నాడు రాహుల్..‌‌........‌..!!
మిమ్మల్ని బ్యాంకులో చూసాను మీ వాలకానికి
కంగారు పడ్డాను మీరు జిరాక్స్ షాపులోకి వెళితే
అనుమాన పడ్డాను ఒకవేళ మీరు మేరేజ్ 
చేసుకున్నారో ఏమో వైఫ్ కి ఏదన్నా కుట్టించటానికి
వచ్చారేమో అని కుసుమ అనగానే నా లైఫ్  వీవైతే
ఇంకో వైఫ్ కూడానా అలా ఎలా ఆలోచించావు......
ఔను లే ఆడవాళ్ళకి అనుమానం ఒడ్డాణం లాంటిది
సైజు చిన్నదయినా వెయిట్ ఎక్కువే అన్నట్టు
ఎందుకు అనుమానించవు అని నిష్టూరంగా
అన్నాడు రాహుల్ అందుకే క్షమాపణలు చెప్పాను
అని కుసుమ అనగానే నీ ఈ అమాయకత్వమే నన్ను
నీ దాసుని గా చేసింది అని రాహుల్ అనగానే
ఇద్దరూ నవ్వకుండా వుండలేకపోయారు (సశేషం)

కామెంట్‌లు