"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక ,51,వ బాగం) "నాగమణి రావులపాటి"
 గీత అన్నది కుసుమతో రాహుల్ ఇక్కడికి ట్రాన్సఫర్ అయి వచ్చాడు నువ్వు లోన్ తీసుకున్న బ్యాంక్ లోనే
అతను జాబ్ చేసేది అని చెప్పావు నేను హడావిడిలో వెళ్ళిపోయాను ఎలా కలిసారు ఇద్దరూ అని గీత
అడిగింది కుసుమను.........!!
రాహుల్ కలిసి నప్పటినుండి ఇప్పటి వరకు రాహుల్
తో తన ప్రయాణం పూస గుచ్చినట్లు గీతకు  వివరించింది కుసుమ....గీత విస్మయం తో కుసుమ చెప్పినది శ్రద్ధగా విన్నది ..‌.. మొత్తానికి మీ ప్రేమను
దేవుని దయతో నిలబెట్టుకున్నారు అన్న మాట.....
వీలైతే రాహుల్ ను కలిసి వెళతాను ఇంకా నేను ఒచ్చేసాగా మీ ఇద్దరిని త్వరగా జంటగా చూడాలని
నేను కోరుకుంటున్నాను మీకు పెళ్ళి పెద్దను నేనే
తెలిసిందా అని కుసుమ బుగ్గపై సుతారంగా
మీటింది గీత..... కుసుమ బుగ్గలు సిగ్గుతో
ఎర్రబడ్డాయి .....!!
అంతలోనే అలా అప్పుడే కలలు కనకు ఆర్దికంగా
నేను నిలదొక్కుకున్నా చెల్లికి తమ్ముడికి పెళ్ళిళ్ళు
చేయాలి అప్పుడే నాకు విడుదల అని అన్నది
కుసుమ...ఆ విషయంలో యూ డోంట్ వర్రీ అని
 అన్నది గీత.....!!
 
పెళ్ళిళ్ళు చేయాలంటే అంత ఈజీ కాదు సరేలే నీవు రాగానే నాకేదో సర్ప్రైజ్ అన్నావుఇంతకీ ఏమిటే
ఆ సర్ప్రైజ్ అని అడిగింది కుసుమ గీతను....
వస్తున్నా అక్కడికే వస్తున్నా...కానీ మన స్నేహం
మీద ఒట్టేసి చెప్పు నేను చెప్పే మాటని నీవు
తిరస్కరించను అని  అన్నది గీత.........‌!!
ఏంటే భయపెడుతున్నావా ఆజ్జాపిస్తున్నావా 
నీవు ఎప్పుడూ నాకు అనుకూలంగానే వుంటావు
నాకు ఇబ్బందికరంగా ఏదీ తల పెట్టవు త్వరగా
చెప్పవే ఈ ఉత్కంఠాన్ని నేను భరించలేను అని
అన్నది కుసుమ......!!
కుసుమా నాతమ్ముడు వేణు గురించి నీకు తెలుసుగా
వాడు నీతో కూడా ఎంతో సరదాగా వుండేవాడు 
వాడు మెడిసిన్ పూర్తీ చేస్తాడు ‌ప్రస్తుతం ఒక హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ గాప్రాక్టీస్
చేస్తున్నాడు టూ త్రీ  ఇయర్స్తతరువాత సొంతంగా
హాస్పిటల్ పెట్టుకునే ఆలోచనలో వున్నాడు......!!
అమ్మా వాళ్ళు వాడికి సంభందాలు చూస్తున్నారు...
మన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునేది
ఏమున్నది.... క్రితం సారి నేను వచ్చినప్పుడు
మన పూర్ణిమను చూసాను అది కూడా ఎంత
చక్కగా తయారైంది.........!!
వాళ్ళని ఎంత చక్కగా తీర్చి దిద్దావే నన్ను ఎంతో
మర్యాదగా చూసుకున్నది.... నేను ఇఃటికి వెళ్ళాక
బాగా ఆలోచించాను వేణుకి మన పూర్ణిమను
ఇచ్చి పెళ్ళి చేస్తే నీకు టెన్షన్ వుండదు.‌......!!
రాహుల్ ను నువ్వు పెళ్ళి చేసుకున్నా పూర్ణిమను
పువ్వుల్లో పెట్టిన చూసుకుంటాము ఇంతకంటే
మంచి చాన్స్ నీకు దొరుకుతుందా!! నా పూర్తీ
సపోర్ట్ నీకే నే మావారికి నీ గురించి చెప్పాను...
ఆయన కూడా మనకు ఫేవర్ గానే వుంటారు.‌...!!
అని కుసుమ కేసి ప్రశ్నార్థకంగా చూసింది గీత!!
అంతే గీతను పట్టుకుని వలవలా ఏడ్చేసిందీ
చిన్న పిల్లలా కుసుమ....!! అప్పటిదాకా గూడు
కట్టుకున్న వేదన స్నేహితురాలు సపోర్ట్ తో
గంగా గోదావరి కన్నులవెంట దారలైనాయి..!!
పెద్ద భారమేదో గుండెలపై నుండి తీసేసినట్లు
హృదయం తేలికై సంతోషం కట్టలు తెంచుకుని
ఆనందం భాష్పాలై బాలువారగా గీతా నిజంగా
నాకు పెద్ద సర్ప్రైజ్ నే ఇచ్చావే ఇది ఊహించని
పరిణామమే థాంక్యూ నే అని గీతని (సశేషం)...!!

కామెంట్‌లు