"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 52,వ,బాగంj--"నాగమణి రావులపాటి"
 గీతని ఎంతో కొనియాడింది కుసుమ........!!
అంతా దైవలీల అసలు ఎప్పుడూ నీకు కానీ
నాకు కానీ ఆ ధ్యాసే రాలేదు మనం అనుకోవటం
కాదు పూర్ణిమ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి
అని అన్నది గీత............!!
అవునే నేను వాళ్ళను ఎంత చూసుకున్నా వివాహం
వీషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి నేను
అడుగుతాను కానీ బలవంత పెట్టాను.......
ఒకవేళ అది ఒప్పుకోకపోతే నేను ఊరుకుంటాను
మనస్నేహం మాత్రంఎప్పటిలా వుండాలి అని
గీతతో అన్నది కుసుమ.............!!
ఇంతలో మీరు ఇక్కడ వున్నారా మీకోసం ఇల్లంతా
వెతుకు తున్నాను అంటూ పూర్ణిమ వచ్చింది.....
సరేనే మీరు మాట్లాడుతూ వుండండి కాఫీ
తెస్తాను అని కుసుమ అనేసరికి నాకు కుసుమ
బ్రాండ్ కాఫీ నే కావాలి అని గీత అనేసరికి ముగ్గురూ
నవ్వుకున్నారు..............!!
పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే కుసుమ తమ్ముడు
వేడి వేడి కాఫీ తీసుకు వచ్చాడు అతను తిరిగి
వెళుతుంటే ఆగరా వైభవ్ మీ ఇద్దరితో మాట్లాడాలి...
అని ఆపింది గీత ఏంటి అన్నట్టు ప్రశ్నార్దకంగా
మొహం పెట్టి ఆగాడు కుసుమ తమ్ముడు వైభవ్.....!!
ఇలా రండి మీ అక్క కుసుమ పై మీ అభిప్రాయం 
తెలపండి అని అన్నది గీత.. అక్కపై మా అభిప్రాయం
తెలపాలా ఆ దేవుడు ఎలా వుంటాడో తెలియదు కానీ మా అక్క మాకు దేవత కంటే ఎక్కువ...
దేవతలపై అభిప్రాయాలు వుండవు.......‌.!!
దేవత వరాలు కురిపించే వాటిని సద్వినియోగం 
చేసుకోవటమే మాపని మా తల్లి తండ్రులు కూడా
అంత బాగా చూసుకునేవారు కాదేమో అక్క మాకు
ముల్లు గుచ్చుకుంటుంటే ఆమె కంట్లో కన్నీళ్ళు
వస్తాయి అదీ మా అక్క అంటే అయినా అక్క
గురించి మాకంటే నీకే ఎక్కువ తెలుసు కదా
మిమ్మల్ని అడుగు తున్నావేంటి గీతక్క అని
అన్నారు ఏక కంఠంతో.........‌‌......‌!!
అవునే కానీ కుసుమ మిమ్ముల్ని బాగా చూసు
కుంటుంది  కానీ దాని మనో గీతం మీకు తెలుసా??
అని గీత అడిగే సరికి అక్కా తమ్ముళ్ళు ఒకళ్ళు
ముఖాలు ఒకరు చూసుకున్నారు........!!
అదేంటి మాకు తెలియని మనోగతం అక్కకు
వున్నదా ?? మాకేమీ అర్దం కావట్లేదు అని
అనేసరికి ఔను రా మీరు చూసే కుసుమ నేను
చూసిన కుసుమ వేరు వేరు మీ అమ్మా నాన్న
బ్రతికి వుంటే ఈ పాటికి వివాహం అయి పిల్లా
పాపలతో వుండేది అని అన్నది గీత.....‌...!!
అక్కడ కాసేపు మౌనం రాజ్యం ఏలింది ముందుగా
గీత మాట్లాడటం మొదలు పెట్టింది శ్రోతల పాత్ర
పోషించటం వాళ్ళ ఇద్దరి వంతు  అయింది (సశేషం)..

కామెంట్‌లు