1.
నింగిలోన ఉరిమింది
మేఘమాల నవ్వింది
చిటపట చినుకుల మల్లియ
నేలమ్మను తాకింది.
2.
తొలకరికీ స్వాగతాలు
మట్టిలోని సుగంధాలు
మనసు తాకే మధురంగ
చెప్పలేమోయ్ భావనలు
3.
మృగశిర కార్తి ఏతెంచి
తొలకరి జల్లు కురిపించి
రైతు ఆశలు మొలిపించాయి.
పుడమితల్లి పులకరించి
4.
ప్రకృతియంత పులకింతలు
వాగూ వంకా పరుగులు
విరిజల్లుల అభిషేకమై
నదీమ తల్లి గలగలలు
5.
పసిడి పంటలతొ క్రాంతి
రైతు ఇంట సంక్రాంతి
ప్రకృతి చల్లగ చూస్తే
దేశానికి నవకాంతి
నవకాంతి(మణిపూసలు);-చైతన్య భారతి పోతుల 7013264464
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి