*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౮౭ - 87)*
 * బ్రహ్మ విష్ణువు లకు సదాశివుని యొక్క శబ్దమయ శరీర దర్శనభాగ్యము కలుగుట*
*అప్పుడు శ్రీహరి, "ఈ అగ్ని స్థంబము ఎక్కడి నుండి వచ్చింది. దీనిని మనము ఇద్దరమూ పరీక్షించాలి" అని బ్రహ్మ తో అని, "క్రిందవైపుకు వెళ్లి చూస్తాను" అనుకుంటాడు విష్ణువు. ఈ విధంగా ఆలోచిస్తూ, వేదము, శబ్దమూ రెండింటితో కూడిన పరమశివుని గురించి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఒక రుషి వచ్చాడు. ఆ రుషి, రుషి సముదాయము అంతటికి ముందువరుసలో ముందు వుండే వాడుగా కనిపించాడు. "ఓమ్" అనే శబద్మయ శరీరము గల అగ్ని స్థంబ రూపములో సదాశివుడే ఇక్కడ బ్రహ్మ, విష్ణువు ల మధ్య ప్రకటితము అయ్యాడు అని ఆ రుషి వల్ల విష్ణు భగవానుడు తెలుసు కుంటారు.*
*"ఓమ్ " అనే ఏకాక్షర రూపమైన ప్రణవము, సదాశివుని రూపమే. మొదటి అక్షరము సదాశివుడే పరమకారణము, రుతము, సత్యము, ఆనందము, అమృత స్వరూపము, ఏకాక్షర వాక్యము, ప్రణవము అగు ఏకాక్షరమైన "అ" కారము వల్ల బ్రహ్మ దేవుడుగా ప్రకటితము అయ్యాడు. రెండవ అక్షరము "ఉ" కారము చేత శ్రీ హరి తెలియ బడ్డాడు. మూడవ అక్షరమైన "మ" కారము చేత శివ రూపము ప్రకటితము అయ్యింది. "అ" కారము సృష్టి కర్త, "ఉ" కారము మోహ కర్త, "మ" కారము నిత్య అనుగ్రహ కర్త. అకార సంజ్ఞన కలిగిన బ్రహ్మ బీజము అయితే, ఉకార సంజ్ఞ కలిగిన విష్ణువు యోని అయ్యి, ప్రధానము నకు, పురుషునకు కూడా శివుడే మహేశ్వరుడు. సదాశివుడు తన కోరిక వల్లనే అనేక రూపములు ధరించి కనిపించును.*
*ఈ బీజకమగు మహేశ్వర రూపమైన అగ్ని స్థంబము నుండి అకార రూపమగు బీజము, ఉకార రూపమైన యోనియందు వుండి అండముగా ప్రపంచమంతా వ్యపిస్తున్నది. ఇది బంగారు రంగు లో చూడటానికి చాలా గొప్పగా వుంది. ఈ అండము కొన్ని వేల సంవత్సరాల కాలం సముద్ర గర్భంలో నే వుంది. ఆ తరువాత సదాశివుని కోరికతో రెండు భాగములగా అయ్యింది. సముద్రపు నీటిలో ఉన్న అండము యొక్క ఒక భాగము, జన్మ లేని బ్రహ్మ ఉత్పత్తికి స్థానము అయ్యింది. ఆ అండజము పైన వున్న భాగము బంగారు రంగుతో ప్రకాశిస్తుంది. అదియే అగ్ని స్థంబము రూపములో ప్రకటమైంది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు