*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౯౧ - 91)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*ఉమాదేవితో కలసి శివభగవానుడు కనిపించడం - వారే వారి స్వరూపమును వివరిచడం - బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకరే అని నిరూపణము చేయడం.*
*బ్రహ్మ: నారదముని తో శివదేవుడు తమతో చెప్పిన మాటలను ఇలా చెప్పాడు.*
*ఎంతో గొప్పవారైన దేవగణములు మీరు ఇద్దరూ. మీరిద్దరూ నాపై చూపిన శ్రద్ధా, భక్తులతో నేను చాలా ప్రసన్నతను అనుభవిస్తున్నాను. మీరు ఇద్దరూ కూడా నన్ను చూడండి. మీరు నన్ను ఎలా చూస్తున్నారో, ఆ రూపాన్ని మీరు పూజ చేయండి. ఆ రూపాన్ని ధ్యాన్నిచండి. మీరు ఇద్దరూ కూడా, ఒకరు నా ఎడమ భాగము నుండి, మరొకరు కుడి భాగము నుండి ఉద్భవించిన వారు. నిజంగా ఎంతో మహిమాన్వితులు, బలవంతులు. లోకాలకు తండ్రి వైన బ్రహ్మా, నీవు నా కుడి భాగమునుండి పుట్టావు. అలాగే, లోకాలను పెంచి, పోషించే మహా విష్ణువు నా ఎడమ భాగము నుండి పుట్టాడు. మీ ఇద్దరూ అడిగిన వరములు నేను ఇస్తాను. మీరు నాయందు అచంచలమైన భక్తి, విశ్వాసములు కలిగి వుంటారు. నా ఆజ్ఞానుసారం, బ్రహ్మ దేవా నీవు సర్వ జగత్తును సృష్టి చేయి. విష్ణుదేవా, నీవు బ్రహ్మ చేత సృష్టి చేయబడిన ఈ సర్వ జగత్తునూ పెంచి పోషించు.*
*బ్రహ్మ: ఇలా మా ఇద్దరితో మాట్లాడిన సదాశివుడు, మాకు, ఎంతో గొప్పదైన తన పూజా విధానమును వివరించి చెప్పాడు. అదే విధంగా మేము ఆదేవదేవుని పూజించాము. అలా మాచే పూజలందిన ఆ సదాశివుడు, "ఈ పూజా విధానముతో ఎవరైతే నా పూజ చేస్తారో వారిని అన్ని విధాలా  అనుగ్రహిస్తాను" అనిచెప్పాడు.  ఈ మాటలను విన్న మేము చేతులు జోడించి ప్రణమిల్లాము.*
*అ తరువాత విష్ణు దేవుడు, చేతులు జోడించి "స్వామీ! మీకు మా మీద ఆదరము వుంటే మాకు మీ యందు అనన్యమైన, అచంచలమైన భక్తి వుండేలా అనుగ్రహించమని" అడిగాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు