మదర్ థెరిస్సా చిత్ర కవిత...!!!;-"కవిరత్న""సహస్రకవి"పోలయ్య కూకట్లపల్లిఅత్తాపూర్-హైదరాబాద్-చరవాణి...9110784502
ఏముంది ఏముంది ఆ చిత్రంలో?
కనురెప్పలు మూయని కనువిందుచేసే 
"ఒక సజీవ" దృశ్యముంది...

ఏముంది ఏముంది ఆ చిత్రంలో ?
అది కోటానుకోట్ల ఇసుకరేణువులకు 
జీవంపోసే ఒక చిత్రాకారుని 
"హస్తనైపుణ్యానికి" ప్రత్యక్ష సాక్ష్యం...

ఏముంది ఏముంది ఆ చిత్రంలో ?
ఈ ప్రపంచానికి గాడ్ ఈజ్ లవ్...
"ప్రేమే ఒక దైవమన్న" ప్రేమసందేశముంది... 

ఆమె ఒక పేదప్రజల 
ఆపద్భాంధవురాలు...
ఆమె ఒక శాంతి శిఖరం...
ఆమె ఒక కాంతి కిరణం... 
ఆమె ఒక ప్రేమ పావురం...
ఆమె కులమతాలకతీతంగా
అనాథల అభాగ్యుల
ఆకలిని తీర్చే ఒక అపురూపమైన అమ్మ 
కుష్టురోగుల్ని సైతం అక్కున చేర్చుకుని
అంతులేని ఆప్యాయతను...అనురాగాన్ని 
కురిపించే జాలిగుండెల జగజ్జనని ప్రాణదేవత 

ఆమె చల్లని ఒడిలో 
ముద్దొచ్చే ఒక పసిపాప...
ముఖంమీద ముడుతలు... 
చేతినరాలు సైతం సుస్పష్టం... 
తెల్లని ఖద్దరు నూలుచీర...
చేతి వేళ్ళు...గోళ్ళు... 
ఆర్ద్రత నిండిన...ఆ కళ్ళు...
అంత అందమైన అతిసుందరమైన
ఆ సైకత శిల్పాన్ని 
ఆ చిత్రాకారుడు తీర్చిదిద్దిన 
తీరు నభూతో నభవిష్యతే...

ఆమె ఒక ధృవతార... 
ఆమె ఒక దైవదూత... 
ఆమె ఒక ప్రేమామయి...
ఆమె ఒక దయామయి...
ఆమె‌ ఒక కరుణామయి...
ఆమె ఒక అమృతమయి... 
ఆమే మానవత్వం పరిమళించే
తనువంతా దైవత్వం ఉట్టిపడే మదర్ థెరిస్సా ఆ
సైకత శిల్పం సృష్టికర్తకు... వారి సృజనాత్మకతకు... శతకోటి ప్రణామాలు కామెంట్‌లు
పోలయ్య కవి కూకట్లపల్లి చెప్పారు…
ధన్యవాదాలు సూరి గారు మీకు నా చిత్ర కవితకు ప్రాణం పోసినందుకు వెలుగులోకి తెచ్చినందుకు... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్