సమస్యాపూరణలు;-మమత ఐలకరీంనగర్9247593432
 
*గాడిద! శుంఠా! యని తను ఘాటుగదిట్టెన్*
క.
కూడికలను జేయక మ‌రి
వేడుకవ‌లె బడికి బోవ బెది‌రింపులతో
నాడా పంతులు; పోకిరి!
*గాడిద! శుంఠా!యని తను ఘాటుగ దిట్టెన్*

 సమస్యాపూరణం
*వర కోటీశ్వరుడు యాయవారముఁ జేసెన్*
క.
పరిమితి దాటెడి యప్పుకు
మెరుగులు దిద్దుటను నేర్చి మిక్కిలి మోసమ్
గరిమకు ధీటని జెప్పుచు
*వర కోటీశ్వరుడు యాయవారముఁ జేసెన్*

కామెంట్‌లు