'ఆ' ఇద్దరు నవల; -కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348611445
 'ఆ' ఇద్దరు బాలల నవల మొత్తం ఇద్దరు చిన్నారుల చుట్టూ తిరుగుతుంది.ఈ ఇద్దరు చిన్నారులు ప్రముఖ రచయిత 'మొలక' ఆన్ లైన్ పత్రిక ఎడిటరు శ్రీ వేదాంత సూరిగారి మనవరాళ్ళు.
         ఆద్య, అరియా నాలుగేండ్లు,రెండేళ్ళ పిల్లలు.
వీరు న్యూజిలాండులో ఉన్న ఆక్లాండ్ పట్టణంలో ఉంటారు. ఈ నవలలో ఇద్దరి ముచ్చటైన అల్లరితో పాటు అక్కడి విశేషాలనుకూడా కళ్ళకు కట్టినట్లు వివరించారు సూరిగారు.
      నాలుగేండ్ల ఆద్య చక్కని గ్రీటుంగు కార్డులు తయారు చేసింది, వాటిని టీచర్స్ కి ,స్నేహితులకి ఇచ్చింది .ఆక్లాండులో ఒకరికి ఒకరు గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకోవడం అభినందిచుకోవడం చిన్నప్పటినుండే జరిగే మంచి అలవాటు. పిల్లలు పచ్చిక మైదానంలో ఆడుకోవడం తాతయ్యకు ఆ చిన్నవయస్సులోనే డబ్బు జాగ్రత్తలు చెప్పడం చిత్రంగా మనకు అనిపిస్తుంది!
      ఆక్లాండులో రాత్రి 8.30 వరకు సూర్యుడు కనిపిస్తుంటాడు.ఎందుకంటే ఆ దేశం దక్షిణ ధృవానికి దగ్గరలో ఉంది.అందరు పిల్లలలాగే ఆద్య,ఆరియాలకు టి.వి,సెల్ ఫోను చూడటం బాగా అలవాటు! ఆద్య,ఆరియాలు అక్కడ టి.వి లో వచ్చే 'పెప్ప పిగ్' అనే చిన్న పిల్లల కార్టూన్ నాటికను చూస్తుంటారని సూరి గారు వ్రాశారు.ఇవే కాకుండా మనదేశం నుండి ప్రసారం అయ్యే 'బిగ్ బాస్' వంటి కార్యక్రమాలు కూడా చూసి చర్చిస్తుంటారట! అక్కడ ఓ యానిమాల్ ఫాం అడవి లాటి ప్రదేశంలో ఉంటుందట అక్క పిల్లలు గుర్రాలు, బాతులు మొదలైన జంతువులతో ఆడుకోవచ్చట! ఆక్లాండు లో క్రిస్మస్ ఎండాకాలంలో వస్తుందట! క్రిస్మస్ శాంతా తాతయ్య ఓ మంచి పుస్తకం పిల్లలకు ఇచ్చాడట. 
      పిల్లలను ఎప్పుడూ ఒక చోట ఉంచకుండా అలా వివిధ ప్రదేశాలకు తిప్పడం మంచిదని ,ఆ విధంగా ఆద్య, ఆరియా లను వెల్లింగ్ టన్ అనే పట్టణానికి తీసుక వెళ్ళారు. న్యూజిలాండు పాముల లేని దేశమట! పిల్లలను జూ కి తీసుకవెళ్ళి జంతువుల్ని చూపించారట.ఇంకొక విశేషం దోమలుకూడా అక్కడ ఉండవట! ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిన్ని నవలలో అక్కడి దేవాలయాల సందర్శన పండుగలలో మనవాళ్ళ కలయిక.వాతావరణ వివరణలు వంటి బోలెడు విశేషాలు ఉన్నాయి.చదవడానికి చక్కగా ఉంది.దీని వెల 100 రూపాయలు ఫోటోలు కూడా ఉన్నాయి. వేదాంత సూరిగారిని సంప్రదించి తెప్పించుకోవచ్చు.
                *******

కామెంట్‌లు