మాటల్లో మంచితనం
అది మన మూలధనం
తెలిసి చేరుకో గమ్యం
కలసి తెలుసుకో మర్మం!
కష్టే ఫలి గమనించు
ఫలితం అనుభవించు
దొడ్డ వారి అనుభవం
ఉండదులే పరాభవం !
చెడ్డవారితో చెలిమి
పోగొట్టునులే కలిమి
తెలుసుకో ఈ నిజం
వదిలించుకో నిస్తేజం !
బతుకులోన బాల్యం
చితికిపోని భాగ్యం
అందమైన ఈ లోకం
పొందికైన మన నాకం !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి