లాలీ పాప (బాల గేయం);-గుర్రాల. 9491387977.
లాలి లాలి లాలి ఓమాపాప
నిదురించు ఉయ్యాల ఊప
జో జో జో జో ముద్దుల పాప
నీ బొజ్జ నిండాతిని బజ్జో పాప!

ఇరుగుపొరుగు పాపలొచ్చారు
నిన్ను చూసి వారు  మెచ్చారు
బహుమతులు ఎన్నోతెచ్చారు
ముద్దులెన్నో మరి ఇచ్చారు.  !

మల్లెమొగ్గల  దండ కట్టి
నీ బుగ్గల ఓ చుక్కపెట్ట
దిష్టి తీయులే మీ అమ్మ
కష్టమే ఇంకా లేదమ్మ!


నింగిలోని చందమామ
తొంగి తొంగి చూసే నమ్మ
నీ వెండి గిన్నె లోని బువ్వ
తినిపించు లే ఇక  అవ్వ 

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

కామెంట్‌లు