" మురళి మధురవాణి కైతికాలు (పుస్తక సమీక్ష);- రాథోడ్ శ్రావణ్,--ఉపన్యాసకులు--9491467715
 సమాజానికి మేలు కలుగ జేసేది సాహిత్యం.  సాహిత్యం సమాజంలోని కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ, ప్రజలందరినీ సమానంగా అలరింపచేస్తుంది.సమాజాన్ని శుద్ధి చేసేది కవిత్వం. కవిత్వంలోనే  ఆనందం ఆరోగ్యం.కవిత్వం ఒక తీరని దాహం దాని సాధన చేస్తే అపూర్వమైన ప్రతిఫలం.ఆ ఫలంలోని తీయదనాన్ని స్వీకరించి సేద్యం చేస్తు కవిత్వం  పండిస్తున్న మధురవాణి కవి  మురళి జాదవ్.

భట్టుశ్రీ కలం పేరుతో రచనలు చేయుచున్న
యూవకవి, సాహితీ కీరణం,  ఉపాధ్యాయుడు మురళి జాదవ్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని వేణునగర్ నివాసి.ఆదిలాబాద్ మండలంలోని ఖండాల తాండలో  శ్రీమతి/ శ్రీ  రుక్మాబాయి, రాంజీ నాయిక్ దంపతులకు 1980 మే 10 న జన్మించారు.ఆ తర్వాత వీరి కుటుంబం ఉట్నూర్ వేణునగర్  లో స్థిరపడ్డింది. బాల్యం ఉట్నూర్ లోనే గడిచింది ప్రాథమిక విద్యాభ్యాసం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల పానాపటార్ జైనూర్ మండలంలోను, ఉన్నత విద్య గిరిజన సంక్షేమ ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల  మోడీ కెరామెరి మండలంలోను, కళాశాల విద్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉట్నూర్ యందు డిగ్రీ దూర విద్యా కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ నుండి పూర్తి చేసారు. బి.ఏడ్  యస్ కే యల్ ఎన్ ఆర్ కళాశాల జగిత్యాల  యందు అభ్యాసించారు.వీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉట్నూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాల చింతకర్ర యందు విధులు నిర్వహిస్తున్నారు.
 
 "కైతికాలు" నూతన  తెలుగు లఘు  కవితా ప్రక్రియలో కైతిక కవిమిత్ర, మురళి జాదవ్   శరవేగంతో దూసుకుపోతున్నారు.అనతికాలంలోనే  శతాధిక కైతికాలు 
అల్లి అధినాయకుడికి కంఠ హారాలుగా అలంకరించారు."కైతిక కవి మిత్ర"'పురస్కార గ్రహీత  మురళి జాదవ్ ... ప్రక్రియ రూపకర్తయగు రమేశ్ గోస్కుల కైతికాలలో వారి అలతి అలతి అద్బుత పదాల అంత్యనుప్రాసల అందాల శైలికి అభినందిస్తున్నాను.రెండు రోజుల్లో వందకు పైచిలుకు కైతికాలు అంబరమంత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే రీతిలో లిఖించి తన సాహిత్య పటిమను రుజువుచేసారు.ముఖ్యంగా మంచి తెలుగు సాహితీకారులు కావడంతో అధికంగా మధుర వాణికి  పెద్దపీట వేసారు."మురళి మధుర వాణి కైతికాలు " పేరుతో అందరినీ ఆకట్టుకునే " నెమలి పింఛం" ముఖచిత్రంతో పుస్తక రూపానికి శ్రీకారం చుట్టారు.మధుర మైన కైతికానికి భరోసా నిచ్చారు.
   ఉపాధ్యాయుడు  మురళి జాదవ్ విరిచిత
"మురళి మధుర వాణి కైతికాలు" పొత్తములోని కైతికాలను కొన్ని పరిశీలిద్దాం:-
ఓం శ్రీ గణనాయకం/ ప్రథమం పూజితం /జ్ఞానం చిత్ రూపం / రజతశ్వేత దంతం/ తం పవిత్రం పార్వతీ పుత్రం/ సమామ్యహం సహస్రం
అంటూ తన తొలి కైతికాలో  అది దేవుడు గణనాథుని ప్రథమంగా పూజిస్తాము, జ్ఞానానికి మూలమని, తెల్లని పాలవలే ఏకదంతం  ఓ పార్వతీ పుత్రా అని గణపతి గొప్పతనం గురించి చాటిచెప్పారు.

శుభకరీ భగవతీ /వాగ్దేవి వీణాపాణి /శ్రీ కమల పత్రాక్షీం /
వేద పుస్తక ధారణి/ అమ్మా ! భాషారాంభ/ నమో ! శ్రీ చంద్ర బింబా"సృష్టిలో అన్ని దానముల కన్నా విద్య దానం మిన్న"
బాసర‌  క్షేత్రంలో వెలసిన
చదువులకు మూల గురువైన చదువుల తల్లి శ్రీ సరస్వతీ
మాతను కీర్తిస్తూ భగవతి,వీణావాహిని ,కమల పత్రాక్షీ సకల జ్ఞానం మీతో లభిస్తుంది తల్లి మంచి విద్యా బుద్ధులు ప్రసాదించి మీ కృపాకటాక్షంతో  జ్ఞానయజ్ఞం భక్తి, ఎప్పుడూ మాకు ఉండాలని చదువు తల్లి ఆశీస్సులు కలగాలని సవినయంగా వివరించారు.
 
గురు దేవుల కీర్తి/అది ఘనమైన శక్తి /స్వామి ఆదర్శ మూర్తి /చూపించును మూక్తి/
అయ్యా ! దేమాగురు దాత/మిమ్మతలచి రాసెద రాత'‌ 
అంటూ బంజారాల తొలి గురువు దేమాగురును తలుచుకుంటూ పై కైతికాలో ఇలా అన్నారు అయ్యా ! గురుదేవా ! మీ కీర్తి, శక్తి అనంతం ప్రతి శుభ కార్యక్రమంలో మీ ఆశీర్వాదాలు ఉండాలి స్వామి మీరే మాకు ఆదర్శం అని  కైతికాలలో ఆదిగురువు గొప్పతనం చాటి చెప్పారు.
నా కులవంశ కవి/శ్రీ చంద బర్దాయి /నీ శరణు వేడితి /
స్వామి కల్పించు సోయి అయ్యా ! మొదటి
కవి..నామది/ సరి చెయ్యి చంద్ బర్ధాయి"
బంజారాల  ఆదికవి పృథ్వి రాజ్ రాసో కావ్వం రచించిన  చంద్ బర్థాయి గారు మా కులానికి ములకవి మీరు. మీ శరణనాన్ని వేడుకోంటూనాము మా పై మీ కృపా కటాక్షాన్ని అనుగ్రహించు స్వామి అని చక్కగా అన్నారు.
నేను ఆస్తమిస్తాను/  సంధ్యా వెలుగు తోను/  నేను ఉదయిస్తాను/ తొలికరి కిరణం గాను / వారెవ్వా ! సూర్య భగవాను/ ప్రభవించును ప్రభలతోను.
సూర్యభగవానుడు దినచర్యను ప్రస్తావిస్తూ రోజు తుర్పున ఉదయించి, సాయంత్రం సమయంలో పడమరన అస్తమిస్తూ ఆ దేవుడు రోజు వారి చేసే  నిత్య సత్యాలను వివరించారు.
ధనికుడైన నేమి/దరిద్రుడైన నేమి /రాముడైన నేమి రావణుడైన నేమి/మృత్యు ఒడికి సమానులు/
లేవు తారతమ్యాలు"
ఈ జగత్తులో పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు అది ధనికుడు కానీ దరిద్రుడు కానీ దేవుడు కానీ రాక్షసులు కానీ మనలో అహంకారం,భేదభావం ఎందుకు ఎంతటి వారైనా  కుడా  మృతి ఒడిలో అందరూ సమానులే అని విపులంగా వివరించారు.
ఇలా అనేక అంశాలపై ఆణిముత్యాల్లాంటి 146 కైతికాలను సృష్టించారు.వారు సృజించని అంశం లేదనడం అతిశయోక్తి కాదు.ఉట్నూరు సాహితీ వేదిక  ఉట్నూర్,ఆదిలాబాద్ జిల్లా వారు ఆవిష్కరించబోతున్న కైతిక ప్రక్రియలో రూపుదిద్దుకున్న పుస్తకాలలో ఇది తొమ్మిదోది కైతికాలు ప్రక్రియలో అని చెప్పుట కాసింత గర్వంగా ఉంది.సాహితీ వేత్త  మురళి జాదవ్ గారి కలం నుంచి మరెన్నో సాహిత్య పుస్తక  పరిమళాలు నలుదిశలా వెదజల్లాలని మనసారగ ఆకాక్షిస్తూ... ధన్యవాదాలు తెలుపుతూ...
పుస్తకం వెల;-100/-
ప్రతులకు
మురళి జాదవ్
ఇంటి నెం.10-18
వేణునగర్ ఉట్నూర్
 ఆదిలాబాద్ జిల్లా.
9492539553కామెంట్‌లు