బాగా మబ్బులు పట్టి నల్లటి మేఘాలు కనిపిస్తే వాన వచ్చే లక్షణాలు ఉన్నాయి తప్పకుండా వర్షం పడుతుంది అని మనం అనుకుంటాం. కానీ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా చేసే అవకాశం ఉంది. బాగా గాలి కొట్టి ఆ మేఘాలను ఛిన్నా భిన్నం చేస్తే వర్షం వచ్చే అవకాశమే ఉండదు మానవుడు ఏదైనా ఆలోచిస్తే ప్రకృతి దానికి విరుద్ధంగా చేస్తుంది. అనేది నానుడి. ఆకాశవాణిలో వాతావరణ సూచన చెబుతూ ఉంటారు ప్రతిరోజు. నిజానికి దానిని ఎంత మంది నమ్ముతారు? ప్రత్యేకించి జాలరళ్లకు అది చాలా అవసరం కానీ వారు కూడా నమ్మరు. కారణం నది మీద నుంచి కానీ, సముద్రం మీద నుంచి కానీ వచ్చే గాలి వల్ల వాతావరణాన్ని నిర్ణయించగలరు. రేడియోలో చెప్పినా వినకొండ నది లో కి వెళ్ళినప్పుడు పెద్ద తుఫాను వచ్చి అనేకమంది మరణించిన వారికి రేడియో అంటే నమ్మకం కుదిరింది.
అలాగే మనిషి మరణం కూడా ఏదైనా జబ్బు చేసి మంచం మీద ఉన్న వాడిని పరామర్శించడానికి వచ్చిన వాడు రెండు మూడు రోజులు అని చెప్పి వెళ్ళిపోతాడు అది నిజమో కాదో అతనికి తెలియదు. మంచి వైద్యుడు చూసి దానికి తగిన మందులు ఇస్తే అతను మరికొంతకాలం జీవించగలడు.ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అనారోగ్యం పాలు చేసే వైద్యులను మనం చూస్తున్నాం కదా వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలుసు అనే నానుడి ప్రపంచంలో వ్యాపించింది. దానిని అవగాహన చేసుకొని చక్కటి పద్యంతో వేమన మనకు నీతిని చెప్తున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి