పిసినారి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.94928 11322


 ఈ ప్రపంచంలో ఏకార్యం సాధించాలన్నా  డబ్బు ముఖ్యము అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.వేల లక్షల కోట్ల  ధనాన్ని  సంపాదించిన వారు  దాని వల్లనే వారి కార్యాలను సాధిస్తారా?  ఆరోగ్యం లేకపోతే జీవితం  అంతా వృధా కదా అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఆహార నియమాలు  శారీరక వ్యాయామం  వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సామాన్యంగా మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే  కొంచెం కొంచెం కూడబెట్టి ఆ డబ్బు కొంచెం మిగిలిన తర్వాత  ఇంకొంచెం మరికొంచెం  సంపాదించాలి అంటూ కడుపు కట్టుకొని మరీ దాని కోసం  ప్రయత్నం చేస్తాడు తాను తినడు ఎదుటివారికి పెట్టడు పోనీ మరణించిన తర్వాత అతనితో ఆ డబ్బులు తీసుకోని వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయా అంటే అతనికి అది తెలియదు. తేనెటీగలను చూడండి ఎక్కడ అందమైన  పుష్పం ఉంటే  దానిపైన వాలుతుంది. రకరకాల మధువులను  సేకరిస్తుంది. దానిలో నవరుచులు చేదుగా ఉన్నవేప పువ్వులను కూడా అది వదలదు. చివరికి ప్రాణాలు పోయేంత వరకు సేకరించిన తేనెను  జుర్రుకుంటుందా? ఎవరో బాటసారి చూస్తాడు దాని పూర్తి తేనెను తన సొంతం చేసుకుంటాడు దానిని తాను తన కుటుంబ సభ్యులు అనుభవిస్తారు. ఇలాంటి అతి చిన్న విషయాలను కూడా ఎంతో పరిశీలించి  మానవజాతికి నీతి గురించి చెప్పడం కోసమే తన ఆటవెలదులను రచించాడు యోగివేమన. మొదటి రెండు పాదాలలో  ఎద్దేవా చేస్తూ  మూడో పాదంలో  లోక నీతులు చెప్పి, చివరి  భాగంలో తన మకుటాన్ని చేరుస్తాడు అదివేమన శైలి. కామెంట్‌లు