విశ్వగురువు నా భారతదేశం
విశ్వశాంతి సందేశం నాదేశం
వసుధైక కుటుంబ నాoదీ ప్రస్థానం
విశ్వసౌహార్ద గీతిక సామవేదo
విశ్వజనీన ఆరోగ్యమూలిక చరక సంహిత గ్రంథం
ప్రపంచానికే జ్ఞానబోధ
మనగౌతమబుద్ద
యావత్ప్రపంచానికే తలమానికం
పతంజలి మహర్షి
యోగా
ప్రపంచాన్నే తనవైపు మరల్చుకున్న
ఆరోగ్య వరప్రదాయని పుణ్యభారతావనేగా
శారీరక సౌష్టవానికి యోగాసనాలు
మానసిక పరిపుష్టికి ప్రాణాయామాలు
శారీరక మానసిక పునరుత్తేజానికి యోగo ధ్యానం ఉత్ప్రేరకాలు
క్రమంతప్పని యోగాసనాలు అనుక్షణం నిన్ను రక్షించే ధ్యానమార్గాలు
ప్రతిజీవికి జీవనాధారాలు
భావి తరాలకు ఆరోగ్యదాయకాలు
యోగాసనాలు శారీరక సామర్ధ్యానికి
ధ్యానం నీలోకి పరకాయప్రవేశం చేసి మానసిక ఒత్తిడి మాయం చేయడానికి
అందరం యోగాచేద్దాం
ఆరోగ్య భారతావని నిర్మిద్దాం
అందరం ధ్యానంచేద్దాం
ప్రశాంత చిత్తంతో జన్మను ధన్యం చేసుకుందాం
(తేది : 21 జూన్ 2022 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి