వా ర్ధ క్యా వ స్థ "శంకర ప్రియ.," శీలసంచారవాణి: 99127 67098
 👌చీకు చింతలతోను
     ముగియును "వార్ధక్యము"
     విశ్రాంతి కోరు స్థితి
           ఓ తెలుగు బాల!
          ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌"వార్ధక్యము".. దేహము యొక్క దశలలో నాలుగవది!
ఇది.. మిక్కిలి పరాభవం నొసంగు అవస్థ! ఆత్యంత దుఃఖమును కలిగించునది!
👌వృద్దాప్యము నందు.. కంటిచూపు మందగించును! దంతములు కదలు చుండెను! శరీరము ముడుతలు పడును!
👌ఈ వయస్సులో ఇంద్రియపటుత్వము తగ్గడంవలన, అపహాస్యము పాలగుదురు. అందువలన,  వయోవృద్ధులు.. అందరియందు సమదృష్టితో.. ఓర్పుగా జీవించాలి! కావున, పెద్దవారైన వృద్ధులను.. పిన్నలందరూ; వారికి చేదోడు వాదోడుగా నుండాలి! వారికి యథాశక్తిగా సేవలను చేయాలి!
 ⚜️ కంద పద్యము⚜️
     ఆరోగ్యమె భాగ్యమ్మగు
     ఆరూఢిగ నరయ వలయు, అవసరముల తగన్;
      దారుల నెన్నుచు కనియెడు
       వారికి భారమ్ము నీయ వలదీ దశలో!!
( రచన: "అవధాని", డా. శాస్త్రుల రఘుపతి., )

కామెంట్‌లు