మంచి సంకల్పములు "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 👌మంచి సంకల్పములు
     కలిగియుండా లెపుడు
 
     మంచి ఫలితము లొసగు
          ఓ తెలుగు బాల!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌"సంకల్పము" అనగా.. కోరిక! అని, సామాన్యార్ధము! అది.. మంచిదైనా, లేదా, చెడ్డదైనా కావచ్చును! అది మన మనస్సులో కలిగిన భావన!
👌"సమ్యక్ కల్ప్యతే అనేన, ఇతి సంకల్ప:" అని, అమరకోశము నిర్వచనం ప్రకారం..  దీనిచేత ( మనస్సు చేత ) లెస్సగా ( బాగుగా ) కల్పింప బడునది. కనుక, "సంకల్పము", మరియు, "మనో వ్యాపారము" అని పేరులు!
👌చెడు వినవద్దు! చెడు కనవద్దు! చెడు అనవద్దు! అని, మన మహాత్ముల పిలుపు! అదియే.. మనకు మేలుకొలుపు!
       ⚜️తేట గీతి పద్యము⚜️
     మనిషిలో కోరికలు సదా మారు చుండు 
     మంచివైనచో మననవి, పెంచి తీరు 
     చెడ్డవైనచో  మనకవి, చెఱుపు చేయు 
      తెలుసుకొని తేరుకొను మయ్య! తెలుగు బాల !
     (రచన: "కళారత్న"  డా. మీగడ రామలింగ స్వామి)

కామెంట్‌లు