🙏మంచి మార్గము లందు
మమ్ములను నడిపించు!
మాకు రక్షణ నిమ్ము!
శ్రీమాతా శివాని!
( శ్రీమాత పదాలు., శంకర ప్రియ.,)
👌శ్రీమాత యే శ్రీమహారాజ్ఞి! పరమేశ్వరి.. ఈ చరాచర ప్రపంచమును పరిపాలించు చున్నది! శిష్ట రక్షణము, మరియు దుష్ట శిక్షణము... భగవతి, శ్రీసతి సంకల్పము!
👌లోకములో.. దేవతలు, దానవులు, మానవులు.. మున్నగు సకల ప్రాణికోటికి; మంచి, చెడు మార్గములు.. రెండు గోచరించు చున్నాయి! వాటిలో దుర్మార్గములో ప్రవర్తించు వారిని; శ్రీమాత, "మహాకాళి"యై దండించు చున్నది! అట్లే, సన్మార్గములో ప్రవర్తించు వారిని; శ్రీమాత, "మహా దుర్గ"యై కాపాడు చున్నది!
⚜️అశ్వథాటి వృత్తము ⚜️
దారుల్ గనంబరిచి నేరంబులన్ గొలిపి నేరంబులన్ బొనరచన్
కారుణ్యమున్ విడిచి, పారింతు వేల మము నీరీతి చేయఁ దగునా?
శ్రీరామ రక్షణగ నేరీతి మమ్ములను నీ రాక నిల్పునొ కదా!
హే రాక్షసాంతకి! సదా రక్షమీయు మిఁక, కోరన్ వరంబులు సతీ!
( రచన: శ్రీచింతా రామకృష్ణారావు., శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వథాటి (సతీ శతకము) )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి