సుప్రభాత కవిత ; -బృంద
ఊహలు..వాస్తవాలు
కలవని పట్టాలు...

పయనాలు  గమనాలు
తప్పని గమ్యాలు.

ఆశలూ...కోరికలూ
నడిపించే  ఆధారాలు.

ప్రయత్నం..పరిశ్రమ
తప్పనిసరి  గుణాలు

ఓర్పూ సహనం
విడవకూడని నేస్తాలు.

ఉత్సాహం ..ఉత్తేజం
ఉండాల్సిన ఆయుధాలు.

నిరాశ భయం  నిరాసక్తి
దరిచేర్చకూడని శత్రువులు.

నమ్మకం....ఆత్మ విశ్వాసం
బలమైన అస్త్రాలు..

క్రమశిక్షణ  నైపుణ్యం
గెలిపించే గుణాలు.

ఎత్తుపల్లాలు..జయాపజయాలు
దాటాల్సిన  ప్రతిబంధకాలు

శిశిరం తరువాత వసంతంలా
విజయం తో  ఆలింగనం తథ్యం

అమూల్యమైన క్షణాలను 
మనకోసం మోసుకొచ్చే

అపురూపమైన  ఉదయానికి

🌺🌺 సుప్రభాతం 🌺🌺


కామెంట్‌లు