* హాయిగ బ్రతకాలి *-- కోరాడ నరసింహా రావు

 సూర్యునితోనే... మేల్కొని... 
   రవి వోలె విశ్రమించక...., 
          వెలుగులుపంచే భానుని  వోలె... అందరి ఆకలిదీర్చుచు ఆనందము నందించు రైతువు నీవు... !
 ఈ ఇలలో నీకుసాటి ఎవరన్నా
లోకమునకు ఆహారమునిచ్చు అన్నదాత వు నీవన్నా.... !!
    నీ కష్టం ఫలించాలి.... 
       పంటలు బాగా పండాలి... 
         కలతలు, కన్నీళ్లు మీ దరి  
రాక, మీరంతా సుఖముగఉం డాలి !  మేమంతా  హాయిగ బ్రతకాలి!!
      ******
కామెంట్‌లు