కడలి (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 అమ్మో నీరు
అమ్మమ్మో నీరు 
ఇంత నీరు ఎక్కడా 
కనబడునే తీరు 
నీరంతా ఒక చోట 
ఒలకబోసినారో ఏమో 
అంతులేని జలరాసి కొసన 
భూమి ఉందో లేదో ఏమో 
అదిగో అదిగదిగో 
కనుచూపు మేరలోన 
నింగీ నీరూ కలుస్తున్నాయేమో 
అందాలను ఒలుకుతున్నాయ్
కనువిందులు చేస్తున్నాయ్ 
నీటిలోని కెరటాలకు 
ఎంత పొగరో ఏమో కాని 
పరుగులేమో పెడుతున్నాయ్
 లేస్తున్నాయ్ పడుతున్నాయ్ 
పడినా తిరిగి లేస్తున్నాయ్ 
మనకు పాఠం చెబుతున్నాయ్ !!
.
కామెంట్‌లు