జీవితం ఓ సవాలే!;- డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
        1.జన్మ!

1.బీజంగా పడ్డ నీవు!
   గర్భంలో నవమాసాలెదిగి!
  సజీవంగా లోకంలోకి రావడం!
   జీవితం ఓ సవాలే!

2.బాల్యం,కౌమారం!
  యౌవనం,వార్ధక్యం!
  ఒక్కొక్కటి దాటాలి!
  జీవితం ఓ సవాలే!

3.జన్మ దుఃఖం!
   జరా దుఃఖం!
   మృత్యు దుఃఖం!
   జీవితం ఓ సవాలే!
________
(కొనసాగింపు)


కామెంట్‌లు