మనిషి చెడిపోవడానికి కానీ, బాగుపడడానికి కానీ జీవితంలో జరిగే సంఘటనలు, అతని చుట్టూ ఉన్న పరిసరాలని భారతీయులే కాక పాశ్చాత్యులు కూడా అంగీకరించిన నిజం. ఒక వ్యక్తి ఏదైనా మంచి కార్యాన్ని చేపట్టి దాన్ని చేస్తున్నప్పుడు అవహేళన చేసేవారు ఎక్కువ మంది ఉంటారు. ఉదాహరణకు వేశ్యావృత్తిని స్వీకరించిన వారి జీవితాలను గురించి అధ్యయనం చేయడానికి వారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వారి జీవితాలను గురించి, వారు ఈ స్థితికి రావడానికి కారణాలను గురించి మనసులో ఏమీ దాచుకోకుండా చెబుతారు. వారి పట్ల సానుభూతి తెలియజేసి బయటకు వచ్చిన కార్యకర్తను గురించి ఏం చెప్పుకుంటుంది సమాజం. వీడు వేశ్యాలోలుడు తినడం, తాగడం, తిరగడం తప్ప మరొక పనిలేదు అని ప్రచారం చేస్తారు. తోటివారు అసహ్యించుకునేట్లుగా ప్రవర్తిస్తారు. నిజాన్ని గమనించాలన్న వారు ఒక్కడు కూడా మనకు కనిపించరు. మనిషిలో లోపాలు వెతకడం ప్రారంభించిన తరువాత అతని దుర్గుణాలే కనిపిస్తాయి.
అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు మంచి స్నేహాన్ని వంద రూపాయలు అయినా ఇచ్చి కొనుగోలు చెయ్ అదే చెడ్డ వారి స్నేహం వెయ్యి రూపాయలు ఇచ్చి అయినా వదిలించుకో ఎంత గొప్ప నీతి
అలాగే తాను బ్రతుకుతూ కుటుంబాన్ని బ్రతికించడం కోసం ఏదో చేద్దామని ఏ పనీ దొరక్క చివరకు కల్లు లేక సారాయి అమ్ముకుంటూ వున్న స్నేహితుడు దగ్గరకు ఎవరైనా వచ్చి వారింట్లో పాలు తాగినా అది సారా అని ప్రచారం అవుతుంది. వేమన ఈ విషయాన్ని తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు తాగితే తాటి కల్లు తాగుతున్నాడు అని ప్రజలు అనుకుంటారు తప్ప పాలు తాగుతున్నారని అనుకోరు.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి