పరీక్షలు ముగిశాయి. ఈసారి ఎక్కడకీ వెళ్లటం లేదు. అమ్మా నాన్న సైన్స్ టీచర్లు కావటంతో సైన్స్ ప్రయోగాలు చేసి పిల్లల కి అవగాహన కలిగిస్తున్నారు.లైబ్రరీ లో కొత్త పుస్తకాలు తెచ్చి చదివి చుట్టుపక్కల పిల్లలని పోగేసి సత్కాలక్షేపం చేస్తున్నారు. పిల్లలు గడ్డిపోచలతో బొమ్మలు తయారు చేశారు. దానిపై కిరోసిన్ లో తడిపిన ఓపాత కండువాని కప్పారు.దాన్ని గడ్డిపై ఉంచి అగ్గిపుల్లతో అంటించటం ఆలస్యం!భగ్గుమని కాలిబూడిదైంది.ఇప్పుడు మంత్రతంత్రాలపేరుతో చేసే మోసాలు వివరించారు పిల్లలకి.శివ ఓపాత బట్టని బాగా నీటిలో తడిపి పిండాడు.దానిలో పిండిని నీటితో కల్పి ముద్దలాగాచేశాడు.మూకుడు లో ఎండు గడ్డి వేసి తడిపిన బట్టను దానిపై చక్కగా అమర్చాడు.దాని లో పిండి ప్ర మిదను ఉంచాడు.ఓచిన్న బట్ట ముక్కను కిరోసిన్ లో తడిపి ఆ కండువా మధ్యలో పెట్టాడు. ఆపై నిప్పు అంటిస్తే కిరోసిన్ బట్టముక్క మండుతుంది.కానీ దాని చుట్టూ తడిగుడ్డ ఉంది. అది వేడెక్కినా పిండి ప్రమిద చల్లగా ఉంచుతుంది. చిన్న గిన్నెలో నీరు పోసి పెడితే మరుగుతుంది.మోసగాళ్ళు దూరం గా నించున్న జనాలని ఇలా ట్రిక్కులతో మోసగిస్తారు🌹
సైన్స్ ప్రయోగాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి