బాల మొగ్గలు;----కయ్యూరు బాలసుబ్రమణ్యం శ్రీకాళహస్తి...
బడి పిల్లలను నిశితంగా పరిశీలిస్తూనే
సునిశితంగా విద్యాబుద్దులు నేర్పించాలి
బాలలు సృజనాత్మకతకు ప్రతి రూపాలు

బాలల బడిని ఆనందవేదికగా మారిస్తేనే
వివిధ నైపుణ్యాలను వెలికి తీయగలిగేది
బాలలు కళామతల్లికి అపురూపాలు

నిత్యజీవిత సంఘటనలను కథలుగా చెబితేనే
బాలల మదిలో ఆత్మ స్థయిర్యం సుస్దిరమయ్యేది
బాలలు భారత వీరుల రేపటితరం నిజ రూపాలు


కామెంట్‌లు