దొంగ సరుకులు! అచ్యుతుని అచ్యుతుని రాజ్యశ్రీ

 జమీందారు దగ్గరికి నాగులు వచ్చాడు. "అయ్యా!నామిత్రుడు విదేశీ వస్తువుల దొంగ అక్రమరవాణా చేస్తున్నాడు.అందులో మీకు వాటా ఉంటుంది. మీరు రైతు శివా పొలంలో కొంత భాగం లో చిన్న షెడ్ వేసుకునేలా అతన్ని ఒప్పించండి.నేను అడిగితే ఒప్పుకోడు." డబ్బు కి కక్కుర్తి పడే జమీందారు సరేఅన్నాడు.శివ  దిగువ మధ్యతరగతి రైతు.నీతినిజా యితీకి ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే ఓతాంత్రికుడితో పని నడిపించాడు. హఠాత్తుగా శివా  ఎద్దు అతని పొరుగు రైతు ఆవు చనిపోటంతో ఇద్దరు బెంబేలు ఎత్తి జమీందారు దగ్గరికి పరుగెత్తారు. చేతబడి చేశారనే పుకార్లు షికార్లు కొట్టాయి.జమీందారు వారి మొరవిని నాగులు కి తెలుసున్న మంత్రతంత్రగాడిని పిలిపించాడు.
: "రాత్రి నాకు గ్రామ దేవత కల్లోకివచ్చింది.తనకు గుడికట్టించమని చెప్పింది"అని అంటూ శివా పొరుగున ఉన్న రైతు చేతుల్లో పసుపు పోసి గట్టిగా పిడికిలి బిగించమని హెచ్చరించాడు.ఆపై పెద్ద గా మంత్రాలు చదవసాగాడు.శివచేతిలో పసుపు ఎర్రరంగులో కి మారింది. రామురైతు చేతిలోది పసుపు వన్నెలోనే ఉంది. "శివా!మన ఊరికి అరిష్టం కలుగకుండా కాపాడే బాధ్యత నీదే! నీపొలంలో కొంతభాగం ని అమ్మ గుడికి ఇవ్వు"అని చెప్పాడు. అంతా శివా పొలంలో కి  వెళ్ళారు మాంత్రికుడు చూపే స్థలం చూట్టానికి. నదికి పావు మైలు దూరం లో ఉన్న ఆపొలం లో తిరుగాడాడు .జమీందారు తోసహా అంతా దేవత చూపే స్థలం కోసం తిరుగుతున్నారు"ఓం మహాశక్తి మహాకాళీ"అంటూ!హఠాత్తుగా  మంత్రగాడి పాదాలు ఓచోట ఆగాయి.అక్కడ నీరు పైకి ఉబికి వస్తోంది. ఆప్రాంతం కి దగ్గరగా పడవల రాకపోకలు సాగుతున్నాయి. "ఆ!ఇక్కడే గుడికట్టాలి"అరిచాడు. వాడి పాదాలు నీటితో తడిశాయి.ఇంకేముంది,సున్నంతో ముగ్గులు పసుపు కుంకాలతో పూజ చేసి నాలుగురోజుల తర్వాత వద్దాము అన్నాడు. ఆరోజు  అంతా పూజలు కొబ్బరికాయలు కొడుతూ హడావుడిగా ఉండగా ఓశిలామూర్తి తలకిరీటం పైభాగాన్నిచూశారు అంతా! అక్కడ తవ్వితే మూరెడు ఎత్తున్న అమ్మ విగ్రహం కనపడింది. నాగులు అక్కడ పూజారిగా స్థిరపడటం చిన్న ఆలయం ఓనెలకల్లా సిద్దంకావటం చకచకా జరిగాయి. ఆగుడివైపు సాయంత్రం ఏడు దాటాక ఎవరూ వెళ్లరాదు అనే నిబంధన పెట్టాడు జమీందారు. అలా చేస్తే అరిష్టం అని హెచ్చరించాడు తాంత్రికుడు! శివా కి చాలా బాధగా ఉంది. తనపొలంలో కొంత భాగం  కబ్జాకి గురైంది అనేవిషయం గుర్తించాడు.ఆరోజు పొలంనించి వస్తూ దూరం గా  పడవనించి కొన్ని పెట్టెలు మోస్తూ నాగులు  మంత్రగాడు కనపడ్డారు.చిరు జల్లులు కురవటంతో గుడి వరండాలో ఆగాలని అటువైపు నడిచాడు. లోపల మాటలు వినపడుతున్నాయి. ఆపొదనించి గమనిస్తున్న శివా కి మద్యంపెట్టెలు కనపడ్ఠాయి.సరాసరి ఇంటికెళ్లి  ఓఐదుమందిని పోగేసి పోలీసు స్టేషన్ కి వెళ్ళాడు.జోరుగా వర్షపుహోరులో పోలీసు సిబ్బంది వచ్చి  గుళ్ళో తాగిపడున్న అందరినీ అరెస్టు చేసి  ఇద్దరు పోలీసులని కాపలాకి ఉంచి తమపని కానిచ్చారు.జమీందారు ని కూడా  అదుపులోకి తీసుకున్నారు. తాంత్రికుడు శివా రాముల పసుల్ని విషంఇచ్చి చంపాడు. శివా చేతిలో పసుపుకి సున్నంనీరు కల్పి వెంటనే గుప్పిట మూయించటంతో అది ఎర్రబడింది. గొయ్యి లో ముంతను పాతి దాని నిండా నీరు పోశాడు. స్థలం వెతుకులాటలో  అక్కడ ఆగి కాళ్ళ తో మట్టిని బలంగా తొక్కడం తో ముంతనుంచి నీరు పైకి వచ్చింది.అలాగే అమ్మవారి విగ్రహం ముందే పాతాడు.పూజ పునస్కారాలతో  నెమ్మదిగా  కొంచెం కొంచెం గొయ్యితవ్వి విగ్రహాన్ని బైట కి లాగాడు.ఇప్పుడు వాడు కటకటాలపాలు ఐనాడు.జమీందారు జామీనుపై విడుదలైనాడు.శివా  ఆగుడిని అలాగే ఉంచి సాయంత్రం బడిని నడుపుతున్నాడు.హుండీ డబ్బు తో దివ్యాంగులకి ఆహారపొట్లాలు వారానికి మూడు సార్లు ఇస్తున్నాడు 🌹
కామెంట్‌లు