జ్ఞాన దీపం!!!;-కొత్తపల్లి ఉదయబాబు
 పనిలేని పిల్లి బుర్రలో ఉద్భవించిన
ఒక పిచ్చిమొక్క ఆలోచన
ఎరగామారి  ముఖపుస్తక బోనులో పడితే చాలు
లైకుల ఎలకలు కొన్ని వలలో పడతాయి.
ఆత్మీయతతో అభినందించేవారొకరు
అభిమానం పంచేవారొకరు.
బాల్యపు లోతుల్ని సృశించి
గతకాలపు స్నేహగీతాలకు
కొత్తరాగాన్ని కట్టి ఆలపించేవారొకరు.
స్పూర్తి సందేశాల సమాహారాలు
విజ్నాన విషయ వ్యాస పరంపరలు
ఆపాత మృధుమధుర సంగీత  
నృత్య చిత్రకళా విన్యాసాలు
అనునిత్యం హృదయరంజకంగా
అలరిస్తూ మురిపిస్తూ జ్నాన ఉషస్సులను
పెంచే పడమటి సంధ్యారాగాలే.
ఎప్పటికప్పుడు  తాజా ముఖవర్చస్సు
ముఖపుస్తకపు ఆశ్రితులకు వరమే.
ఇన్ని జ్నాపకాల అనుభూతుల పేజీలలో
అక్కడక్కడ విసర్జాలను వదలిన చెదపురుగుల్లా
కొన్ని కొన్ని చిరుగుల ఒయాసిస్సులు.
మనను మనం నియంత్రించుకుంటే
ముఖపుస్తకమెప్పుడూ
అజ్నానుల జీవితాల  సుజ్నాన దీపమే.!!!
***************** 


కామెంట్‌లు