సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  సవాళ్ళు... సహనపు రాళ్ళు
   *****
వ్యక్తి ఉన్న స్థాయి నుంచి ఉన్నతంగా ఎదగాలని అనుకున్నప్పుడు అనేక రకాల సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి.
అవి మనసును వెంటాడేవి కొన్ని,వేధించేవి కొన్ని, మానసికంగా కృంగ దీసేవి కొన్ని, ఎదుగుదలను మధ్యలోనే విరమించుకునేలా మనసును స్తంభింప చేసేవీ కొన్ని.
 గులకరాళ్ళ లాంటి  సవాళ్ళను బాధతో పట్టించుకుంటే గుండె గాయమై, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమన్నది నిజమే.
 కానీ ... అలాంటి సవాళ్ళను మానసిక స్థితిని పరీక్షించే రాళ్ళుగా,చిరునవ్వుతో స్వీకరించాలి.సహనంతో ఏరుకుని ఉన్నతికి సాధనకు సోపానాలుగా నిర్మించుకోవాలి.
అప్పుడే ...ఎదుటి వారికి మనమేంటో త్వరగా కాకపోయినా, నెమ్మదిగా అయినా తెలియడమే కాదు,అంతర్మధనానికి కూడా దారి తీస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు
చక్కటి సుభాషితం