ప్రాప్తం;-ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి
 జీవితంలో అదృష్టం, దురదృష్టం అన్నవి ఉన్నాయి  మనం ఏది చేసినా కలిసి వస్తే  మీరు చాలా అదృష్టవంతులు అని ప్రజలు అంటారు, ఏది చేసినా  చేతి చమురు వదిలించుకునే జాతకునికి  మా వాడు చాలా దురదృష్టవంతుడు  ఏది చేసినా కలిసి రావడం లేదు అని  బంధువులంతా  చిన్న చూపు చూస్తారు. త్యాగరాజ స్వామి తన కీర్తనలో  రానిది రాదు  పోనిది పోదు అని వ్రాశాడు. అది నీ సొంతమైతే నీకు రావలసిన  వస్తువు అయితే  నీ శత్రువర్గం నీకు దక్కకుండా సముద్రంలో పారవేసినా  నీ చేతికి వస్తుంది  రాముని విగ్రహం లేకుండా ఆయన జీవితంలో  ఏకాంతంగా గడిపిన రోజు లేదు  కొంతమంది కావాలని  రాముని విగ్రహాన్ని సముద్రంలో పారవేశారు. ఆర్తితో త్యాగయ్య పాడిన పాటకు మెచ్చి వారి స్థితిని చూసి వారి కంటి నీరు తుడవడం కోసం ఆ సముద్రంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి విగ్రహం  బయటకు వస్తుంది. అంతకుమించిన తార్కాణం  ఏం కావాలి? స్వాతికార్తెలో వర్షం కురిసేటప్పుడు ఒక వాన చినుకు  ముత్యపు చిప్పలో పడితే అది ముత్యం అవుతుంది అదే చినుకు నీటిలో పడితే ఆ సముద్రంలో కలిసిపోతుంది. తనకు ప్రాప్తం ఉంటే కలిసి వచ్చే అదృష్టం ఉంటే అలా స్వాతి ముత్యం  మన కంటి ముందుకొస్తోంది. లేదూ నీటి చుక్కలా సముద్రంలో కలిసిపోతుంది. ప్రాప్తాన్ని నమ్మిన  వేమన  చక్కటి పోలికతో చెప్పారు తన పద్యాలలో.


కామెంట్‌లు