మనుమరాలి ముచ్చట్లు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

మనుమరాలు టీనా
ముచ్చటపరుస్తున్నది
ముద్దుమాటలతోడ
మురిపించుచున్నది

అందచందాలతోడ
అలరిస్తుయున్నది
ఆటపాటలతోడ
ఆనందపరుస్తున్నది

చాకులెట్టులిస్తే
సంబరాపడుతుంది
బిస్కత్తులిస్తే
ముద్దులూపెడుతుంది

తాతదగ్గరకొచ్చి
కథలుచెప్పమంటున్నాది
నానమ్మదగ్గరకొచ్చి
నవ్వించిపోతున్నాది

తల్లిచేత దెబ్బలు
తరచుగా తింటున్నాది
తండ్రికి కబుర్లుచెప్పి
తోషాన్ని ఇస్తున్నాది

మా బుజ్జి టీనా
మా చిట్టి టీనా
మా ఇంటి వెలుగు
నా కంటి మెరుపు

మామంచి టీనా
మాముద్దు టీనా
మాబంగారు టీనా
మాసుగుణాల టీనా

నిండునూరేళ్ళు
జీవించరా
నినుకన్నవారికి
పేరుప్రఖ్యాతులుతేరా


కామెంట్‌లు